RRR: అఫీషియల్.. ఆస్కార్ బరిలోకి ‘ఆర్ఆర్ఆర్’

ABN , First Publish Date - 2022-10-06T20:27:30+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బృందం తీపి కబురు చెప్పింది. ఆస్కార్ అవార్డ్స్ బరిలో దిగుతున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. సోషల్ మీడియా మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

RRR: అఫీషియల్.. ఆస్కార్ బరిలోకి ‘ఆర్ఆర్ఆర్’

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బృందం తీపి కబురు చెప్పింది. ఆస్కార్ అవార్డ్స్ బరిలో దిగుతున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. సోషల్ మీడియా మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ కు గ్టోబల్ స్టేజ్‌పై లభించిన సక్సెస్ చూసి మేం గర్విస్తున్నాం. ‘ఆర్ఆర్ఆర్’ భాష, సాంస్కృతిక సరిహద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను ఏకం చేసింది. కొన్ని నెలలుగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరి వల్లనే ఆస్కార్ బరిలోకి దిగుతున్నాం. జనరల్ కేటగీరిలో ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) కోసం అప్లై చేశాం. ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన వారందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 


కొన్ని రోజుల క్రితం హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో ఉండే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ఈ సినిమాకు అవార్డు తప్పక వస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీ క్రేజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘ఆర్ఆర్ఆర్’ ను ఇండియా తరఫున ఆస్కార్‌కు పంపిస్తే ఈ చిత్రం తప్పక అవార్డును గెలుచుకుంటుందని పేర్కొన్నాడు. కానీ, ‘ఛెల్లో షో’ (Chello Show) అనే చిత్రాన్ని ప్రభుత్వం ఇండియా తరఫున ఆస్కార్‌కు పంపించింది. అయినప్పటికి, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మాత్రం నిరుత్సాహపడలేదు. జనరల్ కేటగీరిలో అవార్డు కోసం పోటీపడాలని నిర్ణయించుకుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. దర్శకధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli) దర్శకత్వం వహించాడు. రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఛార్ట్ టాప్ టెన్-10 మూవీస్‌లో ఇప్పటికి ట్రెండ్ అవుతుంది.



Updated Date - 2022-10-06T20:27:30+05:30 IST