RRR : నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2022-06-02T15:49:25+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) మొదటి సారిగా హీరోలుగా నటించిన ఈ సినిమా మార్చ్ 25న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

RRR : నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డు

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) మొదటి సారిగా హీరోలుగా నటించిన ఈ సినిమా మార్చ్ 25న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 1920లో బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలించే కాలంలో జరిగిన కల్పిత కథగా జక్కన్న తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్లు పైచిలుకు వసూళ్ళను కురిపించి సత్తా చాటుకుంది. 


ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ ను మే 20న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోనూ, తెలుగుతో సహా ఇతర వెర్షన్స్‌ను జీ5 (Zee5) లోనూ స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. అక్కడ కూడా ఈ సినిమాకి అత్యధిక ప్రేక్షకాదరణ దక్కింది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఒక అరుదైన రికార్డును సాధించి అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యకాలంలో విడుదలైన ఆంగ్లేతర సినిమాల్లో ఆదరణ పరంగా నె0. 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషా చిత్రాల్లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రత్యేకంగా నిలిచింది.  


‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కెమేరామేన్  సెంథిల్ కుమార్ (Senthil Kumar) తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియచేస్తూ ట్వీట్ చేశారు. ‘యస్.యస్.రాజమౌళి ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన  ఆంగ్లేతర చిత్రాల్లో అత్యధికులు వీక్షించిన చిత్రంగా అధికారికంగా నెం. 1 గా నిలిచింది. దాదాపు 60 దేశాల్లో 18 మిలియన్ వాచ్ అవర్స్‌తో ట్రెండింగ్‌లో నిలిచిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది ఈ సినిమా’.. అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఈ విషయంలో మరోసారి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 



Updated Date - 2022-06-02T15:49:25+05:30 IST