RRR : జపాన్‌లోనూ సంచలనానికి రెడీ !

ABN , First Publish Date - 2022-07-22T23:25:05+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన ఈ క్రేజీ మల్టీ్స్టారర్ ఈ మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

RRR : జపాన్‌లోనూ సంచలనానికి రెడీ !

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన ఈ క్రేజీ మల్టీ్స్టారర్ ఈ మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రీఇండిపెండెన్స్ కథాంశంతో అల్లూరి సీతారామరాజు,  కొమరంభీమ్ పాత్రలతో ఫిక్షనల్‌గా రూపొందిన ఈసినిమాకు భారతీయ బాక్సాఫీస్ షేకయింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1100 కోట్లకు పైగానే వసూళ్ళు సాధించి సౌత్ సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది. ఈ సినిమా విడుదలై నాలుగు నెలలు అయిపోయింది. అయినప్పటికీ ఈ సినిమా వైబ్రేషన్స్ ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఓటీటీలోనూ ఈ సినిమాకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్‌ వచ్చాకా దీని రచ్చ మామూలుగా లేదు. డాక్టర్ స్ట్రేంజ్ (Doctor Strange) రచయిత నుంచి మొదలు పెట్టి.. బడా సాఫ్ట్ వేర్ కంపెనీల సీయీఓల వరకూ అందరూ పొగడ్తల వర్షం కురిపించిన వారే. ఇప్పుడు ఈ సినిమాకి మరో ఘనత కూడా యాడ్ అవుతోంది. 


ఇండియన్ వెర్షన్ విడుదలైన ఏడు నెలల తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జపాన్‌లో ఈ అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎంత ఆన్‌లైన్‌లో వచ్చినప్పటికీ.. జపాన్ వాసులు ఈ సినిమాను ఇప్పటి వరకూ చూడడం కుదరలేదు. అక్కడ పైరసీ, ఓటీటీలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఏదైనా పరభాషా చిత్రం విడుదలవ్వాలంటే బోలెడన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ పూర్తయ్యేటప్పటికి నెలలు గడిచిపోతాయి. గతంలో ‘బాహుబలి’ (Bahubali) సిరీస్‌కీ ఈ తిప్పలు తప్పలేదు. అందుకే  ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ జపాన్ బాక్సాఫీస్ వద్దకు చేరుకోడానికి ఇంత టైమ్ పట్టింది. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ కంటెంట్‌తో విడుదలైన చిత్రాలకు జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమా ఏమాత్రం నచ్చినా వేల కోట్ల కలెక్షన్స్‌ను కురిపిస్తారు. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జపాన్‌లోనూ సంచలనాలకు తెరదీస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు. 


రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ జపాన్ లోనూ భారీ వసూళ్ళను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జక్కన్న అక్కడ ఒక బ్రాండ్‌గా మారిపోయారు. అలాగే ప్రభాస్ (Prabhas)కూడా జపాన్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. అతడి పుట్టిన రోజు వేడుకల్ని అక్కడ ప్రత్యేకంగా జరిపారంటే.. డార్లింగ్ అక్కడవారికి ఎంతగా డార్లింగ్ అయిపోయాడో అర్ధమవుతోంది. ఇంకా అందులో నటించిన సుబ్బరాజు (Subbaraju) ‌కు సైతం అక్కడ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో జక్కన్న ఇమేజ్‌తో త్వరలో అక్కడ విడుదలకు సిద్ధమైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇంకే స్థాయిలో సక్సెస్ నమోదు చేస్తుందో, తారక్ అండ్ చెర్రీలకు ఏ స్థాయిలో పేరొస్తుందో చూడాలి. 



Updated Date - 2022-07-22T23:25:05+05:30 IST