#RRR trailer : విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం

ABN , First Publish Date - 2021-12-09T16:50:20+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దేశం మొత్తం మీద ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల్ని అలరించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్నంగా చేస్తున్నారు జక్కన్న. అందులో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ట్రైలర్ ను ఈ రోజు (గురువారం) విడుదల చేశారు.

#RRR trailer : విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దేశం మొత్తం మీద ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల్ని అలరించబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్నంగా చేస్తున్నారు జక్కన్న. అందులో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ట్రైలర్ ను ఈ రోజు (గురువారం) విడుదల చేశారు. దాదాపు 3 నిమిషాలపాటు సాగిన ఈ విజువల్ విస్ఫోటనానికి ఫ్యాన్స్ ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు. అబ్బురపరిచే టేకింగ్ అండ్ మేకింగ్ తో మాస్ మాయాజాలం చేశారు రాజమౌళి. ఈ ఉదయం 11గంటలకు విడుదలైన ఈ ట్రైలర్ ఇటు యూట్యూబ్ లోనూ, అటు థియేటర్స్ లోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. 


కొమరం భీమ్ గా యన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ అద్భుతమైన స్ర్కీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్  అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. ‘స్కాట్ దొరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్నపిల్లను తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వారికేమైనా రెండు కొమ్ములుంటాయా? ఒక కాపరి ఉంటాడు’ అనే డైలాగ్ పై  బ్రిటీష్ వారికి కొమరం భీమ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ ట్రైలర్ బిగినవుతుంది. పులితో యన్టీఆర్ ఢీకొట్టే సన్నివేశం రివీలవుతుంది. ఆ వెంటనే .. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్.. అనగానే రామ్ చరణ్ పోలీస్ పాత్ర ఎంటర్ అవుతుంది. ఆ పై ఈ రెండు పాత్రల స్నేహ సంబంధంపై విజువల్స్ వస్తాయి. ‘తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే’.. అంటూ ఆవేశంగా యన్టీఆర్ పలికే డైలాగ్ అద్భుతం అనిపించకమానదు. ‘యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి’ అనే అజయ్ దేవ్ గణ్ పాత్ర కూడా ఆకట్టుకుంది. చివరలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్, కొమరం భీమ్ గెటప్ లో యన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. ‘ఈ నక్కల వేట ఎంత సేపు కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద’ అనే చెర్రీ డైలాగ్ అండ్ విజువల్స్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. మొత్తం 3 నిమిషాల 15 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేస్తోంది. మరి థియేటర్స్ లో ఈ సినిమా ఎలాంటి విజువల్ ఫీస్ట్ ను ఇస్తుందో చూడాలి. 



Updated Date - 2021-12-09T16:50:20+05:30 IST