RRR : ట్రెండింగ్‌లో ‘మంచి మిత్రులు’ సినిమా

ABN , First Publish Date - 2022-07-15T17:18:01+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగావపర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) హీరోలుగా తొలిసారి తెరమీద కనిపించి అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు.

RRR : ట్రెండింగ్‌లో ‘మంచి మిత్రులు’ సినిమా

దర్శకధీరుడు రాజమౌళి మలిచిన క్రేజీ  మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగావపర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) హీరోలుగా తొలిసారి తెరమీద కనిపించి అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.1100 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టి.. సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. ఓటీటీలో సైతం చిత్రం విశేషమైన ప్రజాదరణ దక్కించుకుంది. కొమరం భీమ్‌గా యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ తమ అభినయాన్ని, ఎమోషన్స్‌ను తెరపై పీక్స్‌లో పండించి భారతీయ ప్రేక్షకుల్ని అలరించారు. అసలు విషయానికొస్తే ఈ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad).. రాజమౌళి చిత్రాల కోసం ఎక్కువగా పాత సినిమాల్లోని సన్నివేశాల్ని, పాత బుక్స్‌లోని పాత్రల్ని ప్రేరణగా తీసుకుంటారని తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం  ఇంట్రవెల్ సన్నివేశం కోసం 53 ఏళ్ళనాటి సూపర్ హిట్ తెలుగు చిత్రం ‘మంచి మిత్రులు’ (Manchi Mitrulu) చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ప్రేరణగా తీసుకున్నారని ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. 


‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోని ఇంట్రవెల్ బ్యాంగ్ థియేటర్స్ లో ఏ స్థాయిలో పేలిందో తెలిసిందే. బ్రిటీషర్స్ చెరలో ఉన్న చిన్నపాపను రక్షించడానికి వన్యమృగాలతో యన్టీఆర్ అటాక్ చేసే సన్నివేశం గుర్తుంది కదా.. ఆ చిన్నారిని యన్టీఆర్ ఆల్మోస్ట్ రెస్క్యూ చేశాడు అనుకొనే లోపే..  పోలీస్ ఆఫీసరైన రామ్ చరణ్ హఠాత్తుగా ఊడిపడతాడు. ఇటు వన్యమృగాలతోనూ, అటు యన్టీఆర్ తోనూ పోరాడి.. చివరికి అతడ్ని అరెస్ట్ చేస్తాడు. అసలు రామ్ చరణ్ పాత్ర పోలీస్ అన్న సంగతి యన్టీఆర్ కు తెలియదు. చరణ్ ను పోలీస్ యూనిఫామ్ లో చూసి యన్టీఆర్ షాకవుతాడు. సరిగ్గా ఇదే సన్నివేశం కృష్ణ (Krishna), శోభన్ బాబు (Shobhan Babu) హీరోలుగా తాతినేని రామారావు (Thathineni Ramarao) దర్శకత్వంలో 1969లో వచ్చిన ‘మంచి మిత్రులు’ సినిమాలోనూ ఉంటుంది.  


‘మంచి మిత్రులు’ సినిమాలో కృష్ణ దొంగగానూ, శోభన్ బాబు పోలీసాఫీసర్ గానూ నటించారు. ఒకరికొకరు తమ వృత్తులేంటో తెలుసుకోకుండానే మంచి మిత్రులవుతారు. ఆ తర్వాత ఒక సన్నివేశంలో తనను అరెస్ట్ చేయడానికొచ్చిన శోభన్ బాబును చూసి స్టన్ అవుతారు. ఆయన పోలీసాఫీసర్ అని తెలిసిన కృష్ణ ఆశ్చర్యపోతారు. ఇదే సన్నివేశం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోనూ ఉండడంతో .. ప్రస్తుతం ‘మంచి మిత్రులు’ చిత్రాన్ని నెటిజెన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.  విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్.ఆర్.ఆర్’ సన్నివేశం కోసం 53 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాను వాడుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.   

Updated Date - 2022-07-15T17:18:01+05:30 IST