‘ఆర్ఆర్ఆర్’: రైజ్ ఆఫ్ రామ్ చరణ్.. ‘రామం రాఘవం’

ABN , First Publish Date - 2022-01-01T04:25:57+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకలోకం ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో.. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం 2022, జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో

‘ఆర్ఆర్ఆర్’: రైజ్ ఆఫ్ రామ్ చరణ్.. ‘రామం రాఘవం’

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకలోకం ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో.. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం 2022, జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే పాన్ ఇండియా వైడ్‌గా మీడియా సమావేశాలు నిర్వహించిన టీమ్.. ఇప్పుడు చిత్రం కోసం చేసిన ప్రత్యేక గీతాలను విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ పాత్ర అయిన కొమురం భీమ్‌పై ఓ గీతాన్ని విడుదల చేసిన చిత్ర బృందం.. తాజాగా రామ్ చరణ్ ధరించిన అల్లూరి సీతారామరాజు పాత్రకి సంబంధించిన గీతాన్ని విడుదల చేసింది.


రైజ్ ఆఫ్ రామ్ పేరుతో ‘రామం రాఘవం’ అనే సాహిత్యంతో వచ్చిన ఈ గీతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గీతానికి కె. శివశక్తి దత్తా సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాశ్, చందన బాల కల్యాణ్, చారు హరిహరన్‌లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సింగర్స్ ఆలపించారు. ఈ పవర్ ఫుల్ చిత్రానికి ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ పరిచయం ఎలా ఉండబోతుందీ.. అనేదానికి హింట్ ఇస్తున్నట్లుగా అతని పాత్రకు సంబంధించిన సన్నివేశాలను జోడిస్తూ.. క్లాసిక్ మ్యూజిక్‌కి వెస్టరన్ టచ్ ఇస్తూ ఈ గీతాన్ని రూపొందించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  



Updated Date - 2022-01-01T04:25:57+05:30 IST