ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీలో మార్పులేదు

ABN , First Publish Date - 2021-12-31T18:26:06+05:30 IST

మెగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కరోనా వైరస్‌ తాజాగా ఒమైక్రాన్‌ రూపంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై అపోహలు

ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీలో మార్పులేదు

బెంగళూరు: మెగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కరోనా వైరస్‌ తాజాగా ఒమైక్రాన్‌ రూపంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై అపోహలు నెలకొన్న నేపథ్యంలో కర్ణాటకలో చిత్రహక్కులు పొందిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్వాహకులు ఈ మేరకు స్పష్టీకరణ ఇచ్చారు. చందనసీమలో ఈ సినిమా భారీ ఆశలు రేకెత్తిస్తోందని, చిత్రం బాక్సా ఫీస్‌ హిట్‌ అందుకోవడం ఖాయమని సంస్థ ఆశా భావం వ్యక్తం చేసింది. 


ఫిబ్రవరి 4న ‘గజానన అండ్‌ గ్యాంగ్‌’ 

 మహదేవ హీరోగా, అదితి ప్రభుదేవా హీరోయిన్‌గా నటిస్తున్న గజానన అండ్‌ గ్యాంగ్‌ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న వెండితెరపైకి రానుంది. రెండేళ్లపాటు చందనసీమలో తాను చేసిన కృషికి ఈ సినిమా అద్దం పట్టనుందని, తన కల సాకారం కానుందని దర్శకుడు అభిషేక్‌ శెట్టి గురువారం మీడియాకు తెలిపారు. నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి అభిరుచిమేరకు దర్శకుడిగా స్థిర పడిన శెట్టి ఈ చిత్రానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కాలేజీ కథ ఆధారంగా హాస్యాన్ని సెంటి మెంట్‌తో జోడించి పండించారు. హీరో మహదేవ్‌ ఈ చిత్రంలో ద్విపాత్రలు పోషించారు. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన కాలేజీ విద్యార్థినిగా అదితి చక్కటి పాత్ర పోషించారని దర్శకుడు తెలిపారు. బృందావన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై యూఎస్‌ నాగేశ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో రఘుగౌడ, చేతన్‌దుర్గ, నాట్యరంగ, అశ్విన్‌ హాసన్‌, శమంత్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 


‘ధమాకా’ పాటకు భారీ క్రేజ్‌ 

చందనసీమలో ప్రముఖ హాస్య కళాకారుడిగా గుర్తింపు పొందిన శివరాజ్‌ కేఆర్‌ పేట ప్రధానపాత్ర పోషిస్తున్న ధమాకా చిత్రానికి సంబంధించిన తొలిపాట విడుదలైంది. తూకాలి జీవన అనే పాట యూట్యూబ్‌లో భారీ సంచలనం చేస్తోంది. దర్శకుడు లక్ష్మీరమేశ్‌ స్వయంగా ఈ పాటను రాయగా నవీన్‌ పాడారు. వికాస్‌ వశిష్ట సంగీ తాన్ని అందించారు. ధమాకా టీజర్‌కు ఇప్పటికే రెస్పాన్స్‌ బాగుందని తొలిపాట కూడా ఆకట్టుకుంటోందని దర్శకుడు వెల్లడించారు. హాస్యభరిత ఈ చిత్రంలో సిద్దూ మూలిమని, ప్రియా ఆచార్‌, ప్రకాశ్‌ తుంబినాడ్‌, మోహన్‌ దునేజా, అరుణ బాల్‌రాజ్‌ ప్రధానపాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌ మీడియా ప్రొడక్షన్స్‌, నంది ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సునీల్‌ ఎస్‌ రాజ్‌, అన్నపూర్ణపాటిల్‌ నిర్మిస్తున్నారు.



Updated Date - 2021-12-31T18:26:06+05:30 IST