బ్రేకింగ్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా!

ABN , First Publish Date - 2022-01-01T22:46:25+05:30 IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదల వాయిదా పడింది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే! ‘‘కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నడుస్తున్న కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం.

బ్రేకింగ్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదల వాయిదా పడింది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే!. అయితే ‘‘కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నడుస్తున్న కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. మంచి టైమ్‌లో ఇండియన్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా తెలియజేసింది. దీంతో కొందరు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు నిరాశ పడినట్లుగా చెబుతున్నారు.


అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 7న ఖచ్చితంగా వస్తుందని అంతా అనుకున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కొన్ని రోజులుగా చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఈ సినిమా విడుదల పక్కా అనేలా ప్రేక్షకులలోకి తీసుకెళ్లాయి. అయితే అకస్మాత్తుగా ఒమైక్రాన్.. కోవిడ్ కేసులు పెరగడంతో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయగా, మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూని విధిస్తున్నట్లుగా ప్రకటించాయి. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో.. ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని ఇప్పుడు తీసుకురావడం మంచిది కాదని భావించిన ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ మరోసారి వాయిదా వేయడానికే మొగ్గుచూపారు. మళ్లీ పరిస్థితులన్ని చక్కబడిన తర్వాత గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటనలో తెలిపారు.



Updated Date - 2022-01-01T22:46:25+05:30 IST