వంద సిగ్నేచర్‌ స్టెప్పులు

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది.

వంద సిగ్నేచర్‌ స్టెప్పులు

‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు  సినిమా సత్తా చాటింది. ఈ సినిమాతో పాటు ‘నాటు నాటు’ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయింది. ఈ పాట చిత్రీకరణ కోసం యూనిట్‌ చాలా కష్టపడింది. ఇటీవల అమెరికాలో జరిగిన బియాండ్‌ ఫెస్ట్‌లో రాజమౌళి ఈ విషయాన్ని గురించి మాట్లాడారు. ‘రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌...ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లు. ఇద్దరూ కలసి డాన్స్‌ చే స్తున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. పాటకు వీలుగా ఒక సన్నివేశాన్ని సృష్టించాను. ప్రేమ్‌రక్షిత్‌ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశారు. మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ పాట కోసం అతను వంద సిగ్నేచర్‌ స్టెప్పులు రూపొందించారు. డాన్సర్లకు కాళ్ల నొప్పులు వచ్చాయి’ అని చెప్పారు. ఆ వీడియోను ప్రేమ్‌రక్షిత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయింది. 

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST