RRR : ఆస్కార్‌కు నామినేట్ అవుతుందా?

ABN , First Publish Date - 2022-06-21T18:36:46+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన ఈ పిరియాడికల్ ఫిక్షనల్ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే.

RRR : ఆస్కార్‌కు నామినేట్ అవుతుందా?

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)  తొలిసారిగా హీరోలుగా కలిసి నటించిన ఈ పిరియాడికల్ ఫిక్షనల్ మూవీ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఆలియాభట్ (Alia Bhatt), అజయ్ దేవ్ గణ్ (Ajay Devgan), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna), సముద్రఖని (Samudrakhani), శ్రియా శరణ్ (Shriya Sharan) ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగానే వసూళ్ళను రాబట్టి.. సౌత్ సినిమా సత్తాను మరోసారి చాటింది. 


పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకుంది. అలాగే.. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకి అక్కడ కూడా విపరీతమైన స్పందన దక్కింది. ప్రముఖ హాలీవుడ్ రైటర్ క్రిష్టఫర్ మిల్లర్ (Christopher Miller), సినిమా, టీవీ రైటర్ ఆమీ పౌలేట్ హార్ట్ మేన్ (Amy Paulette Hartman) లాంటి వారే కాకుండా.. మరెందరో హాలీవుడ్ ప్రముఖులు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని, రాజమౌళి టేకింగ్ ను ఆకాశానికెత్తేశారు. 


ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఆస్కార్ (Oscar) కు నామినేట్ అవుతుందా లేదా అన్న విషయంలో సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. భారతీయ ప్రేక్షకులు ఆ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మనదేశం నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఆస్కార్ నామినేషన్ కు వెళితే.. ఖచ్చితంగా తిరస్కారానికి గురవుతుందని చాలా మంది అనుకొనే మాట. ఆర్ట్ హౌస్ కేటగిరికి చెందిన ఏ అస్సామీ చిత్రమో లేక ఏ హిందీ చిత్రమో దాని ప్లేస్ లో నామినేట్ అవుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి మనదేశం నుంచి బలమైన రికమండేషన్ లభించి నామినేట్ అయితే మాత్రం నిజంగా అది హిస్టరీనే. సో.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అవ్వాలని ఆశిద్దాం.  

Updated Date - 2022-06-21T18:36:46+05:30 IST