అదనపుభారం లేకుండానే ఓటీటీలోకి ‘RRR’

ABN , First Publish Date - 2022-05-19T18:12:48+05:30 IST

ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం ZEE 5 లో మే 20 నుండి ఉచితంగా లభించనుంది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది ZEE 5.

అదనపుభారం లేకుండానే  ఓటీటీలోకి ‘RRR’

ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లందరికీ అతిపెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం ZEE 5 లో మే 20 నుండి ఉచితంగా లభించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది ZEE 5. ప్రారంభించిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాన్ని  అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  చిత్రం పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు. దాంతో సాధారణ ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని, "ZEE5" T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది.  సాధారణ చందాదారులందరికీ  ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాన్ని ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. 


ఇప్పటికే ఉన్న ZEE  సబ్‌స్క్రైబర్స్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  చిత్రాన్ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు చేసిన అభ్యర్థనలను ZEE5 టీం పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి, మే 20 నుండి ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు, పెయిడ్ యూజర్‌లకు ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాన్ని ఉచితంగా అందించనుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  S-VODలో మే 20,  వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. రూ. 699 చెల్లించి కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ ZEE5 వారు మార్పు చేసిన ప్లాన్ ప్రకారం మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యేవిధంగా అందించబోతున్నారు. .యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా,  దర్శకుడు రాజమౌళి రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్  ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో  వీక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి "RRR" ప్రీమియర్‌ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తున్నారు. 

Updated Date - 2022-05-19T18:12:48+05:30 IST