RRR : టీఆర్పీ రేటింగ్‌లోనూ అదరగొట్టేసింది !

ABN , First Publish Date - 2022-08-25T21:11:06+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోలుగా తొలిసారిగా నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1100 కోట్లు పైగానే వసూళ్ళు రాబట్టి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది.

RRR : టీఆర్పీ రేటింగ్‌లోనూ అదరగొట్టేసింది !

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోలుగా తొలిసారిగా నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మలిచిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1100 కోట్లు పైగానే వసూళ్ళు రాబట్టి తెలుగు సినిమా సత్తాను మరోసారి చాటిచెప్పింది. ఈ సినిమాకు ఓటీటీలోనూ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన హిందీ వెర్షన్ కొద్దిరోజులుగా నాన్ ఇంగ్లీష్ మూవీగా టాప్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. అలాంటి ఈ సినిమా ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర వీక్షకుల్ని, అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే. 


తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ (TRP Rating) విడుదలైంది. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన ఈ సినిమాకి ఏకంగా 19.6 టీఆర్పీ వచ్చింది. మలయాళంలో ఫస్ట్ టైమ్ దీనికి 13.47 టీఆర్పీ రావడం విశేషం. మలయాళం టెలివిజన్ ప్రీమియర్స్ చరిత్రలో ఇదే అత్యధికం. ఆలియా భట్, ఒలివియా మోరిస్, శ్రీయా శరణ్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మొత్తానికి థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ అదరగొట్టిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్స్ టాప్ రేటింగ్ తెచ్చుకోవడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.  

Updated Date - 2022-08-25T21:11:06+05:30 IST