Oscar 2023: ఆస్కార్ ఎంట్రీ ఫైనల్.. ట్రోల్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-09-21T18:47:17+05:30 IST

గత కొద్దిరోజులుగా సినీ లవర్స్ అందరూ ఆస్కార్ 2023 (Oscar 2023) ఎంట్రీకి వెళ్లబోయే సినిమా గురించే మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే...

Oscar 2023: ఆస్కార్ ఎంట్రీ ఫైనల్.. ట్రోల్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్

గత కొద్దిరోజులుగా సినీ లవర్స్ అందరూ ఆస్కార్ 2023 (Oscar 2023) ఎంట్రీకి వెళ్లబోయే సినిమా గురించే మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ (RRR), ది కాశ్మీర్ ఫైల్స్‌(The Kashmir Files)లో ఏదో ఒక సినిమాని భారతదేశం తరుఫున ఆస్కార్‌కి నామినేట్ చేస్తారని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే ప్రచారం జరిగింది. ఆ రెండు సినిమాల ఫ్యాన్స్ మధ్య నెట్టింట పెద్ద వార్ జరిగింది. కానీ.. వీటన్నింటిని తలకిందులు చేస్తూ గుజరాతీ సినిమా ‘చెల్లో షో (Chello Show)’ని జ్యూరీ సభ్యులు ఆస్కార్‌కి నామినేట్ చేశారు. చెల్లో షో అంటే ‘ది లాస్ట్ షో లేదా చివరి ఆట’ అని.


ఇది ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌కి కోపం తెప్పించింది. అందుకే ఈ సినిమాని పాశ్చాత్య దేశాలకు చెందిన ఆడియన్స్ అభిమానించడమే కాకుండా.. పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు కురిపించడం గురించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా.. ఇందులో నటించిన ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ఆ దేశాల్లో అభిమానులు కూడా ఏర్పడ్డారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ని అవమానించారంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఫిల్మ్ ఫెడరేషన్ ఇలాంటి తప్పే చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. 2013లో ‘లంచ్ బాక్స్‌’ సినిమాని కాకుండా..  గుజరాతీ మూవీ ‘ది గుడ్ రోడ్’ని ఆస్కార్‌కి పంపించారు. ఇప్పుడు కూడా అలాంటి తప్పే చేస్తుందని విమర్శలు చేస్తున్నారు. ‘లంచ్ బాక్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంత గుర్తింపు పొందిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిసారి ఇలాంటి తప్పు చేయడం కరెక్ట్ కాదని ట్వీట్స్ చేస్తున్నారు. కాగా.. 95వ అకాడమీ అవార్డులు మార్చి 12, 2023న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతాయి. దీనికి సంబంధించిన నామినేషన్లను వచ్చే ఏడాది జనవరి 24న ప్రకటిస్తారు.











Updated Date - 2022-09-21T18:47:17+05:30 IST