SS.Rajamouli: తారక్ భుజాల మీద రామ్ చరణ్.. ఫైట్ కంపోజ్ చేసింది అతడే..

ABN , First Publish Date - 2022-10-05T21:14:53+05:30 IST

‘బాహుబలి’ ప్రాంచైజీతో భారత్ అంతట క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli).

SS.Rajamouli: తారక్ భుజాల మీద రామ్ చరణ్.. ఫైట్ కంపోజ్ చేసింది అతడే..

‘బాహుబలి’ ప్రాంచైజీతో భారత్ అంతట క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli). ‘బాహుబలి’ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ (RRR)కు దర్శకత్వం వహించి భారతీయ సినిమాల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలో వీక్షిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అమెరికాలో తాజాగా హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్‌’ (Beyond Fest) ను నిర్వహించారు. అందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు వెర్షన్‌ను లాస్ ఏంజెలిస్‌లోని టీసీఎల్ చైనీస్ థియేటర్‌లోని ఐమ్యాక్స్‌ స్క్రీన్‌‌లో ప్రదర్శించారు. ఈ స్క్రీనింగ్‌‌కు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. సినిమా అనంతరం నిర్వహించిన కశ్చన్ అండ్ అన్సర్ సెషన్‌లో రాజమౌళి పాల్గొన్నాడు. నాటు, నాటు సాంగ్ వెనుక ఉన్న ఆసక్తికర సంగతులను పంచుకున్నాడు.    


‘ఆర్ఆర్ఆర్’ లో నాటు, నాటు పాట నాలుగు వెరియేషన్స్‌లో ఉంటుందని రాజమౌళి తెలిపాడు. అందుకోసం డ్యాన్స్ కొరియో‌గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (Prem rakshit) 100స్టెప్స్ క్రియేట్ చేశాడని చెప్పాడు. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్‌కు కూడా పనిచేశాడని వెల్లడించాడు. తారక్ భుజాల మీద రామ్ చరణ్ కూర్చుని ఫైట్ చేసే సన్నివేశాన్ని రూపొందించింది ప్రేమ్ రక్షితే అని స్పష్టం చేశాడు. ప్రేమ్‌తో పనిచేయడం తనకెంతో ఇష్టమని జక్కన్న పేర్కొన్నాడు. ‘‘నాతో సినిమా చేసేటప్పుడు ప్రేమ్ రక్షిత్ వేరే ప్రాజెక్టులకు పనిచేయడు. నాటు, నాటు స్టెప్స్ కోసం ప్రేమ్, అతడి అసిస్టెంట్స్ ఎంతగానో కష్టపడ్డారు. ఆ స్టెప్స్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు వారందరి కాళ్లు నొప్పిని తట్టుకోలేకపోయేవి. అయినప్పటికి వాటన్నింటిని భరించి మంచి డ్యాన్స్ మూవ్స్ ఇచ్చారు’’ అని రాజమౌళి తెలిపాడు. 



Updated Date - 2022-10-05T21:14:53+05:30 IST