RRR: ఐపీఎల్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమానే

ABN , First Publish Date - 2022-08-27T22:23:35+05:30 IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram

RRR: ఐపీఎల్ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమానే

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR). డీవీవీ ఎంటర్‌టై‌న్‌మెంట్ నిర్మించింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్(Olivia Morris) కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25న విడుదలైంది. రూ.1200కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓటీటీ‌లోను రికార్డు స్ట్రీమింగ్స్‌ను దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో 14వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిన ఏకైక ఇంగ్లీష్, నాన్ ఇంగ్లీష్ సినిమా‌గా ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం టెలివిజన్‌లో‌ను సంచలనాన్ని నమోదు చేసి రికార్డు టీర్పీలను దక్కించుకుంది.  


‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ టెలివిజన్‌లో ఆగస్టు 14న ప్రసారమయింది. జీ-సినిమాలో 8గంటలకు ప్రసారమవగా రికార్డు టీఆర్పీలను దక్కించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ టీవీలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ ప్రీమియర్‌కు 10.57మిలియన్ ఇంప్రెషన్స్ లభించాయి. ఈ చిత్రాన్ని ఒక్కో వ్యక్తి సగటున 87.4 మినిట్స్ చూసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా సెకండ్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌గా కూడా ఘనతను దక్కించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందు  ఫస్ట్‌ప్లేస్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే ఉంది. మలయాళంలో ఫస్ట్ టైమ్ దీనికి 13.47 టీఆర్పీ రావడం విశేషం. మలయాళం టెలివిజన్ ప్రీమియర్స్ చరిత్రలోనే ఇది అత్యధికం. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ దర్శకులు రుస్సో బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్, ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడు స్కాట్ డెరిక్సన్, స్క్రీన్ రైటర్ జాన్ స్పైహ్ట్స్ తదితరులు ఈ మూవీని మెచ్చుకున్న సంగతి తెలిసిందే.



Updated Date - 2022-08-27T22:23:35+05:30 IST