RRR: ఇండియన్ ఓటీటీ హిస్టరీలో బిగ్గెస్ట్ రికార్డు..

ABN , First Publish Date - 2022-06-24T16:57:42+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya)

RRR: ఇండియన్ ఓటీటీ హిస్టరీలో బిగ్గెస్ట్ రికార్డు..

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మాణంలో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా ఈ ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరన్, ఓలివియ మోరీస్ సహా ఇతర సౌత్ అండ్ హాలీవుడ్ నటీటులు కీలక పాత్రల్లో కనిపించారు.


దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవల పలు భాషల ఓటీటీల ద్వారా కూడా సినీప్రేమికులకు అందుబాటులోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన పలు ఇతర దేశాల ప్రముఖులు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అయితే, మే 20న హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది ఆర్ఆర్ఆర్.


ఈ క్రమంలో ఇప్పటివరకు ఏకంగా 45 మిలియన్ గంటలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మొత్తం ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డుని సృష్టించింది. ఆ విధంగా అటు థియేటర్స్‌లో కలెక్షన్స్ పరంగా, అలాగే ఇటు ఓటీటీలో వ్యూస్ పరంగా రెండిట్లోనూ ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి మరింతగా పెరిగిందని సినీ విశ్లేషకులు, ప్రముఖులు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-06-24T16:57:42+05:30 IST