RRR: అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-08-13T20:15:54+05:30 IST

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (RRR) మూవీకి సంబంధించిన వార్త ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ramcharan),

RRR: అరుదైన గౌరవం

ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన వార్త ఒకటి బాగా ట్రెండ్ అవుతోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ramcharan), యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR) హీరోలుగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి మార్క్ మేకింగ్..చరణ్, తారక్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ సినిమాని తారా స్థాయిలో నిలబెట్టాయి. పలు వాయిదాల తర్వాత విడుదలైనా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా సత్తా చాటింది.


ఇప్పటివరకు వచ్చిన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటిది జరగలేదు. ఇప్పటికే, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హాలీవుడ్ సినీ ప్రముఖులు దర్శకుడు రాజమౌళి ప్రతిభను గొప్పగా ప్రశంసించారు. బాహుబలి సిరీస్‌తో జక్కన్న మన తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించారు. అదే రేంజ్‌లో ఆర్ఆర్ఆర్ కూడా చేరువైంది. దర్శక ధీరుడు ఏం చేసిన అది ఓ వినూత్న ప్రయోగం అని చెప్పడానికి ఇదీ కూడా ఓ గొప్ప ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమాకు ఎలాంటి గౌరవం దక్కుతుందో మరోసారి ఆర్ఆర్ఆర్ నిరూపించింది. ఇప్పుడు ట్విట్టర్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా మా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని గుర్తించినందుకు ధన్యవాదములని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, ఈ భారీ చిత్రం టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమయింది. స్టార్ మా లో తెలుగు వెర్షన్, జీ సినిమాలో హిందీ వెర్షన్ ఆగస్టు 14న ప్రసారం అవబోతోంది. 




అయితే, ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటించిన చరణ్, కొమురమ్ భీమ్ పాత్రలో అలరించిన తారక్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ నుంచి వస్తున్న ప్రతీదీ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గూగూల్ సర్చ్‌లో ఆర్ఆర్ఆర్ అని టైప్ చేయగానే ఈ మూవీలో చరణ్ ఉపయోగించిన గుర్రం, తారక్ ఉపయోగించిన బైక్ ఒకదాని వెనక ఒకటి అలా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు దీని గురించే అంతటా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన అంశాలను గూగుల్ ఇలా గుర్తిస్తుంది. 

Updated Date - 2022-08-13T20:15:54+05:30 IST