రౌడీ అల్లుడు సరికొత్త వెర్షన్‌ ధమాకా

ABN , First Publish Date - 2022-12-11T05:40:22+05:30 IST

రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు ప్రసన్నకుమార్‌ బెజవాడ. రవితేజ ‘ధమాకా’ చిత్రానికి ఆయన కథ, మాటలు, స్ర్కీన్‌ ప్లే అందించారు...

రౌడీ అల్లుడు సరికొత్త వెర్షన్‌ ధమాకా

రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు ప్రసన్నకుమార్‌ బెజవాడ. రవితేజ ‘ధమాకా’ చిత్రానికి ఆయన కథ, మాటలు, స్ర్కీన్‌ ప్లే అందించారు. ఈనెల 23న ‘ధమాకా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రవితేజ గారితో ముందు మరో కథ అనుకొన్నాం. కానీ రీమేక్‌ రైట్స్‌ సంపాదించడం సాఽధ్యం కాలేదు. అందుకే ‘ధమాకా’ అనే కొత్త కథ రాసుకొన్నాం. కేవలం రవితేజ గారిని దృష్టిలో ఉంచుకొని రాసుకొన్న కథ ఇది. ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో.. ఈ సినిమా అలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘రౌడీ అల్లుడు’ సినిమాకి సరికొత్త వెర్షన్‌లా ఉంటుంది ధమాకా. విశ్రాంతికి ముందొచ్చే ఎపిసోడ్‌.. ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందన్న నమ్మకం ఉంది. నాలో ఓ బుల్లి రవితేజ ఉన్నాడు. కాబట్టి.. ఈ స్ర్కిప్టు రాయడం పెద్దగా కష్టమనిపించలేదు. దర్శకుడు నక్కిన త్రినాథరావుకీ నాకూ మంచి బాండింగ్‌ కుదిరింది. నేనేం అనుకొంటున్నానో ఆయనకు తెలుసు. నేను రాసిన సీన్‌ ఆయన ఎలా తీస్తారో నాకు తెలుసు. అందుకే మా ప్రయాణం ఇలా కొనసాగుతోంది. త్వరలోనే మెగాఫోన్‌ పట్టబోతున్నా. నాగార్జున గారితో ఓ సినిమా చేస్తున్నా. ఇది రీమేక్‌ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి’’.


Updated Date - 2022-12-11T05:40:22+05:30 IST