Vikram: సోషల్ మీడియా అంతా రోలెక్స్ జపం

ABN , First Publish Date - 2022-06-09T03:23:45+05:30 IST

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది

Vikram: సోషల్ మీడియా అంతా రోలెక్స్ జపం

విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ (Vikram). డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్‌తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) - మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. వీళ్ళతో పాటు కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) గెస్ట్ రోల్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. అద్భుతమైన కాస్టింగ్‌తో అల్టిమేట్ క్రూతో దర్శకుడు లోకేష్ సృష్టించిన ఈ మల్టీవర్స్ డార్క్ వరల్డ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 


అయితే ఇప్పుడు అన్ని చోట్లా విక్రమ్ - రోలెక్స్ (Rolex) క్రేజ్ కనిపిస్తోంది. రోలెక్స్ అనేది ఈ మూవీలో సూర్య పాత్ర పేరు. ఇందులో సూర్య డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అయితే అతని స్క్రీన్ టైం చాలా తక్కువ. కనిపించింది కాసేపే అయినా రోలెక్స్ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు. ‘విక్రమ్’ సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. రోలెక్స్‌గా సూర్య కనిపించిన కొన్ని నిముషాలు మరో ఎత్తు అన్నట్లుగా సూర్య పాత్రని లోకేష్ తీర్చిదిద్దారు.


గతంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’కి సీక్వెల్ ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’ మూవీలకు లీడ్ అన్నట్లుగా సూర్య పాత్ర ఉంటుంది. సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో రోలెక్స్ గురించే మాట్లాడుతున్నారంటేనే.. దాని ప్రభావం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కమల్, సేతుపతి, ఫహద్ అద్భుతమైన నటనకు తోడుగా సూర్య అతిథి పాత్ర కూడా జత కలవడం ‘విక్రమ్’ సినిమా ఘన విజయానికి కారణమని చెప్పొచ్చు.  రాబోయే రోజుల్లో విక్రమ్ - ఢిల్లీ - రోలెక్స్ - అమర్‌లతో డైరెక్టర్ లోకేష్ మల్టీవర్స్‌లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Updated Date - 2022-06-09T03:23:45+05:30 IST