కొత్త మైలురాయిని చేరిన KGF Chapter 2.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా రికార్డు..

ABN , First Publish Date - 2022-05-09T22:10:18+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్(yash) హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’ (KGF: Chapter 2). యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన

కొత్త మైలురాయిని చేరిన  KGF Chapter 2.. ఆ దేశంలో ప్రదర్శించిన తొలి కన్నడ చిత్రంగా రికార్డు..

రాకింగ్ స్టార్ యశ్(yash) హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’ (KGF: Chapter 2). యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’ (KGF) కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా విడుదలైనా కొన్ని దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులో లేదు. తాజాగా ఈ చిత్రాన్ని ఓ దేశంలో ప్రదర్శించారు. దీంతో ఈ మూవీ ఓ కొత్త మైలురాయిని చేరింది.    


ప్రశాంత్ నీల్ (prashanth neel) దర్శకత్వం వహించిన ‘కెజియఫ్: చాప్టర్-2’ చిత్రాన్ని తాజాగా సియోల్‌ (Seoul)లో ప్రదర్శించారు. ఈ క్రమంలో దక్షిణకొరియాలో ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా ‘కెజియఫ్-2’ రికార్డు సృష్టించింది. కరోనా అనంతరం ఆ దేశంలో విడుదలయిన తొలి ఇండియన్  మూవీగా ఘనతను దక్కించుకుంది. కన్నడతో పాటు హిందీ వెర్షన్‌ను కూడా సౌత్ కొరియాలో ఒకేసారి ప్రదర్శించారు. ‘కెజియఫ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తుంది. 2022లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపుగా రూ. 1130కోట్ల వసూళ్లను రాబట్టింది. ‘కెజియఫ్: చాప్టర్-2’ లో యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 



Updated Date - 2022-05-09T22:10:18+05:30 IST