Rocketry Twitter review: మాధవన్ మూవీ ఎలా ఉందంటే.. ముఖ్యంగా Suriya, Shah Rukh Khan అయితే..

ABN , First Publish Date - 2022-07-01T18:02:40+05:30 IST

విలక్షణ నటుడు మాధవన్ తాజాగా నటించిన చిత్రం ‘రాకెస్ట్రీ: ది నంబీ ఎఫెక్ట్ (Rocketry The Nambi Effect)’...

Rocketry Twitter review: మాధవన్ మూవీ ఎలా ఉందంటే.. ముఖ్యంగా Suriya, Shah Rukh Khan అయితే..

విలక్షణ నటుడు మాధవన్ (Madhavan) తాజాగా నటించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ (Rocketry The Nambi Effect)’. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తూ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రముఖ సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోగ్రఫీగా తెరకెక్కింది. హిందీతోపాటు తమిళం, ఇంగ్లిష్‌లోనూ జూలై 1 (ఈరోజు)న విడుదలైంది. ఈ మూవీలో తమిళ స్టార్ సూర్య (Suriya), బాలీవుడ్‌ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గెస్ట్‌ రోల్స్‌లో మెరిశారు.


ఈ మూవీ చూసిన పలువురు అభిమానులు ట్విట్టర్ (Twitter) వేదిక పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. నంబి నారాయణన్‌కి ఈ మూవీ సరైన రీతిలో నివాళి అర్పించిందని చెబుతున్నారు. అలాగే మాధవన్ సైటింస్ట్ పాత్రలో జీవించేశాడని అంటున్నారు. అంతేకాకుండా గెస్ట్ రోల్స్ చేసిన సూర్య, షారుఖ్ స్క్రీన్ ప్రజెన్స్, నటన సూపర్ అంటూ రివ్యూ చేస్తున్నారు. ఆ స్టార్స్ ఇద్దరూ వారికి ఇచ్చిన పాత్రలకి న్యాయం చేశారని, ముఖ్యంగా సూర్య అయితే ఎమోషనల్‌గా ఎంతో ఆకట్టుకున్నాడట. అలాగే షారుఖ్‌ సైతం దాదాపు 12 నిమిషాల వరకూ కనిపించి మెప్పించాడని తెలుస్తోంది. రేటింగ్స్ పరంగా చూస్తే ప్రతి ప్రేక్షకుడు ఐదుకి మినిమమ్ నాలుగు స్టార్స్ ఇవ్వడం విశేషం.



















Updated Date - 2022-07-01T18:02:40+05:30 IST