Rocketry: ఓటీటీలో ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-07-20T16:54:44+05:30 IST

ఆర్. మాధవన్ (R Madhavan), సిమ్రన్ (Simran), రంజీత్ కపూర్ (Ranjith Kapoor) నటించిన సినిమా 'రాకెట్రీ (Rocketry): ది నంబి ఎఫెక్ట్.

Rocketry: ఓటీటీలో ఎప్పుడంటే..

ఆర్. మాధవన్ (R Madhavan), సిమ్రన్ (Simran), రంజీత్ కపూర్ (Ranjith Kapoor) నటించిన సినిమా 'రాకెట్రీ (Rocketry): ది నంబి ఎఫెక్ట్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించారు. సూర్య (Surya) కామియోతో వచ్చిన, ఈ చిత్రానికి ఆర్. మాధవన్ దర్శకత్వం వహించారు. ట్రైకలర్ ఫిల్మ్స్ - ఫర్గీస్ మూలన్ పిక్చర్స్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240 దేశాలలో జులై 26, 2022 న అమెజాన్ పైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది. 


ఈ నేపథ్యంలో ఆర్ మాధవన్.. ఈ జీవిత కథను మీ ముందుకు తీసుకొని రావడం చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రము ఇంకా ఎన్ని మైలురాళ్ళను దాటుతుందో చూడాలని నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించి.. నంబి సర్ జీవిత కథకు దర్శకత్వం వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అందుబాటులోకి రాబోతున్నందుకు..ఇంకా ఎంతో మంది అభిమానులను అలరించబోతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను'.. అని ఆర్. మాధవన్ అన్నారు. కాగా, ఈ సినిమాను ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు.

Updated Date - 2022-07-20T16:54:44+05:30 IST