బిజినెస్ మేన్‌తో డేటింగ్ చేస్తోన్న బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ..?

ABN , First Publish Date - 2022-01-20T21:22:11+05:30 IST

‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి నర్గీస్ ఫక్రీ. ‘మద్రాస్ కేఫ్’, ‘మై తేరా హీరో’, ‘కిక్’ వంటి సినిమాల్లో నటించింది.

బిజినెస్ మేన్‌తో డేటింగ్ చేస్తోన్న బాలీవుడ్ నటి  నర్గీస్ ఫక్రీ..?

‘రాక్ స్టార్’  సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి నర్గీస్ ఫక్రీ.  ‘మద్రాస్ కేఫ్’, ‘మై తేరా హీరో’, ‘కిక్’ వంటి  సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమెకు చిత్రాలు లేకపోయినప్పటికీ వ్యక్తిగత కారణాల రీత్యా పతాక శీర్షికెక్కుతోంది. ఒక బిజినేస్ మేన్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని బీ టౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో బీ-టౌన్ యాక్టర్ ఉదయ్ చోప్రాతో ఆమె సహజీవనం చేసింది. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఎంటర్ ప్రెన్యూర్ టోనీ బీగ్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నర్గీస్ ఫక్రీ, టోనీ బీగ్ 2021 చివరలో డేటింగ్ మొదలుపెట్టారట. ఆ బంధం చాలా బలంగా కొనసాగుతోందని సమాచారం. టోనీ బీగ్ కశ్మీర్‌లో జన్మించాడని తెలుస్తోంది. అతడు ఒక కంపెనీకి మెనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 


‘‘ఒకరితో మరొకరు సమయం గడపడానికి ఇద్దరు ఇష్టపడతారు. జంటగా బయటకు కూడా వెళతారు. డేటింగ్ ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి మీడియా కంట పడకూడదని భావిస్తున్నారు’’ అని ఈ జంటతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. టాలీవుడ్‌లో నర్గీస్ ఫక్రీ ఒక సినిమా చేయబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కబోయే ‘‘హరిహర వీరమల్లు’’లో ఆమె కీలక పాత్రలో కనిపించనుందట. మొదట ఆ పాత్రకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని చిత్ర బృందం ఎంపిక చేసింది. జాక్వెలిన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కోవడంతో ఆమెని సినిమా నుంచి తప్పించారని సమాచారం.

Updated Date - 2022-01-20T21:22:11+05:30 IST