సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోట్ల విలువైన నగలు, డబ్బు మాయం..

ABN , First Publish Date - 2022-04-09T21:43:01+05:30 IST

సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోట్ల విలువైన నగలు, డబ్బు మాయం.. సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోట్ల విలువైన నగలు, డబ్బు మాయం..

సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ.. కోట్ల విలువైన నగలు, డబ్బు మాయం..

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని ఆమె నివాసంలోకి చొరబడ్డ దుండగులు దాదాపుగా రూ. 2.4కోట్ల విలువైన నగలు, డబ్బును దోచుకెళ్లారు. ఈ దొంగతనం ఫిబ్రవరి 11న జరిగినట్టు పోలీసులు తెలుపుతున్నారు. తమకు ఫిబ్రవరి 23న ఫిర్యాదు అందినట్టు వెల్లడించారు. హై ప్రొపైల్ కేసు కావడంతో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి గోప్యంగా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. 


ఈ నేపథ్యంలో పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఫిబ్రవరి 11న చోరీ జరిగింది. మాకు మాత్రం ఫిబ్రవరి 23న ఫిర్యాదు అందింది. నగలు, డబ్బు కలసి దాదాపుగా రూ.2.4కోట్లను దుండగులు దోచుకెళ్లారు. కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’’ అని పోలీసులు ఓ ప్రకటనను విడుదల చేశారు. సోనమ్ కపూర్ నివాసంలో ఈ ఏడాదిలో ఇలా చోరీ జరగడం రెండో సారి. సైబర్ నిందితులు ఆమె మామయ్య హరీష్ అహుజాను బోల్తా కొట్టించి దాదాపుగా రూ. 27కోట్లను మోసం చేశారు. దీంతో నిందితులకు వ్యతిరేకంగా గతేడాది జులైలో ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హరీష్ అహుజాకు ఫరీదాబాద్‌లో షాహీ ఎక్స్‌పోర్ట్ ప్యాక్టరీ అనే కంపెనీ ఉంది. ఎక్స్‌పోర్ట్ కంపెనీలకు ప్రభుత్వం రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లివీస్ లైసెన్స్(ఆర్‌ఓఎస్సీ‌టీఎల్) కింద ప్రోత్సాహకాలు అందిస్తుంది. కొన్ని రకాల సుంకాల్లో రాయితీలు కూడా ఇస్తుంది. కొంతమంది సైబర్ నిందితులు ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకున్నారు. హరీష్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దాదాపుగా రూ. 27కోట్ల నగదును కొల్లగొట్టారు.

Updated Date - 2022-04-09T21:43:01+05:30 IST