అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు: హీరో వార్నింగ్

ABN , First Publish Date - 2022-03-16T02:55:17+05:30 IST

కోలీవుడ్‌లో దాదాపు 500 చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. పెద్ద చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే చిన్న చిత్రాలకు కూడా ఇవ్వాలి. రజనీ, కమల్‌, అజిత్‌, విజయ్‌ వంటి అగ్రహీరోల సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు ఉన్నారు. కానీ,

అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు: హీరో వార్నింగ్

అగ్రహీరో అజిత్‌ కుమార్‌పై విమర్శలు గుప్పించేవారికి హీరో ఆర్‌.కె. సురేష్‌ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. అజిత్‌ గురించి విమర్శలు చేసే అర్హత ఇక్కడ ఎవరికీ లేదన్నారు. డాక్టర్‌ మోహన సుందరం ఆశీస్సులతో వినోద్‌ మోహన్‌ హీరోగా ‘మాయన్‌’ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో పలువురు సినీ సెలెబ్రిటీలు హాజరై ఆడియో రిలీజ్‌ చేశారు. 


ఈ సందర్భంగా హీరో ఆర్‌.కె.సురేష్‌ మాట్లాడుతూ.. కోలీవుడ్‌లో దాదాపు 500 చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. పెద్ద చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే చిన్న చిత్రాలకు కూడా ఇవ్వాలి. రజనీ, కమల్‌, అజిత్‌, విజయ్‌ వంటి అగ్రహీరోల సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు ఉన్నారు. కానీ, చిన్న చిత్రాలను మీడియానే ఆదుకోవాలి. అదేసమయంలో హీరో అజిత్‌ గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. సినిమా రంగంలోనే ఉంటూ ఆ రంగానికి చెందిన వారిపై విమర్శలు గుప్పించడం సబబు కాదు.. అలాగే ట్రోల్స్ చేయడం, చేయించడం ఆపండి.. అని అన్నారు. 


దర్శకుడు రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ.. ‘మాయన్‌’ ఒక సినిమాగా చూడటం లేదు. ఒక సంఘటనగా భావిస్తున్నాను. ఎంతో పరిశోధన చేసి తెరకెక్కించాం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ రేయింబవుళ్ళు పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు. అలాగే, దర్శకుడు ప్రభుసాల్మాన్‌, చిత్ర హీరో వినోద్‌, ఇతర టెక్నీషియన్లు ప్రసంగించారు. ఈ మూవీని ఫాక్స్‌ క్రో స్టూడియో, జీవీకేఎం ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మించారు. 

Updated Date - 2022-03-16T02:55:17+05:30 IST