Rk Roja: రాజులకు రోజా ఎర.. నెటిజన్ల సెటైర్లు!

ABN , First Publish Date - 2022-09-30T02:33:16+05:30 IST

సీనియన్‌ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్ర్భాంతికి లోనయ్యారని ఏపీ టూరిజం మినిస్టర్‌ ఆర్‌.కె రోజా అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు

Rk Roja: రాజులకు రోజా ఎర.. నెటిజన్ల సెటైర్లు!

సీనియన్‌ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు (Krishnam raju)మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్ర్భాంతికి లోనయ్యారని ఏపీ టూరిజం మినిస్టర్‌ ఆర్‌.కె రోజా (Rk roja)అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాద్‌రాజు హాజరయ్యారు. తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని రోజా తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు. ‘‘రాజకీయాల్లో ఉండి మంచివారనే పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. ఆ ఘనత కృష్ణంరాజుగారికి దక్కింది. ఆయన సినిమాల్లోనే రెబల్‌స్టార్‌ బయట సున్నిత మనస్కుడు. ఆయనకు వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన ప్రభాస్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగారు. కృష్ణంరాజును ప్రేమించే అందరికీ ఆయనలా ఈ ప్రాంతానికి అండగా ఉండాలని ప్రభాస్‌ని కోరుతున్నా’’ అని రోజా అన్నారు. 


తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. కృష్ణంరాజు సేవలకుగానూ స్మృతివనం ఏర్పాటు ఆలోచన మంచిదేనని కొందరు ప్రశంసిస్తుంటే.. కొందరు మాత్రం వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాజుల ఓట్ల కోసమే ఈ ప్రకటన చేశారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కృష్ణంరాజు పేరుతో వచ్చే ఎన్నికల్లో రాజులకు మంత్రి రోజా ద్వారా వైసీపీ సర్కారు (Ycp government)ఇలా ఎర వేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-09-30T02:33:16+05:30 IST