Kisses and Hugs: కుదిరితే హగ్‌.. లేదంటే ముద్దు.. ఇదే తంతు!

ABN , First Publish Date - 2022-09-28T02:51:38+05:30 IST

బిగ్‌బాస్‌ (Biggboss 6)ఇంట్లో ఆసక్తికరంగా సాగాలంటే కంటెస్టెంట్లు గొడవైనా పడాలి. ఇద్దరి మధ్య ఎఫైర్లు అన్నా ఉండాలి. దాంతోపాటు రొమాన్స్‌ కూడా. మొదటి సీజన్‌ నుంచి బిగ్‌బాస్‌లో ఆసక్తికరంగా సాగే స్టఫ్‌ ఇదే.

Kisses and Hugs: కుదిరితే హగ్‌.. లేదంటే ముద్దు.. ఇదే తంతు!

బిగ్‌బాస్‌ (Biggboss 6)ఇంట్లో ఆసక్తికరంగా సాగాలంటే కంటెస్టెంట్లు గొడవైనా పడాలి. ఇద్దరి మధ్య ఎఫైర్లు అన్నా ఉండాలి. దాంతోపాటు రొమాన్స్‌ కూడా. మొదటి సీజన్‌ నుంచి బిగ్‌బాస్‌లో ఆసక్తికరంగా సాగే స్టఫ్‌ (Best stuff)ఇదే. ఈసారి హౌస్‌లో ఒక జంట (Love pairs)మినహా మిగిలిన వారంతా పెళ్లికాని వారే! దాంతో ఆటలో ఆసక్తిపెరగడం కోసం రెండు, మూడు జంటలు తయారవుతున్నాయి. మొదటి వరుసలో ఆరోహి–ఆర్జే సూర్య (Rj Surya -Arohi)ఉన్నారు. వీరిద్దరూ ఒకే మీడియా సంస్థలో పని చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య నాలుగేళ్ల మంచి స్నేహానుబంధం ఉంది. సన్నిహితులు కూడా అదే చెబుతున్నారు. అయితే వీరిద్దరూ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన లవర్స్‌గా మారినట్లు తెలుస్తోంది. అందుకు వారి మధ్య అలకలు, బుజ్జగింపులు, కోపతాపాలు, అర్ధరాత్రి ఫైయింగ్‌ కిస్‌లు చూస్తే అదే నిజమనిపిస్తుంది. చూస్తే వాళకి కాస్త ఓవరాక్షన్‌లాగా కూడా అనిపిస్తోంది.



Biggboss houseలో వీళ్లు ఇంకా ఉన్నారంటే ఈ  చేష్టలే కారణమని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ కూడా అందుకే వీళ్లని కాపాడుతున్నాడని అంటున్నారు. తన టాలెంట్‌కి పదును పెడితే సూర్య ఇంట్లో బలమైన కంటెస్టెంట్‌గా మారగలడు. కానీ అతన్ని వెనక్కి లాగడానికి ఆమెను పక్కన పెట్టారనే కామెంట్‌ వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఆట ఆడదు.. అతన్ని ఆడనివ్వదు. చీటికిమాటికి సూర్యపై అలగడం, చర్చలు పెట్టడం, ప్రైవేట్‌ ప్లేస్‌లో హగ్‌లు ఇచ్చుకోవడం, కుదిరితే ముద్దు పెట్టడం ఇదే జరుగుతోంది. ఈ ఇద్దరి మధ్య లింక్‌ బాగానే ఉందనుకుంటున్నారేమో బిగ్‌బాస్‌ కూడా వీళ్లని మరింత దగ్గర చేేస ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ప్రోమోలో ఈ ఇద్దరూ కాస్త బయటపడ్డారు. సమయం కుదిరితే సూర్య–ఆరోహి స్టోర్‌ రూమ్‌లో ఓ మూలకి చేరుతున్నారు. మంతనాలు చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య ఓ సమస్య వచ్చింది. సూర్య వేరే అమ్మాయిలతో క్లోజ్‌ ఉంటున్నాడని ఆరోహి అలక పాన్పు ఎక్కింది. అదే ఫీలింగ్‌ నీ విషయంలోనూ నాకుంది అని సూర్య అంటాడు. నీకు ఇద్దరూ కనెక్ట్‌ అయితే నాకు నలుగురు కనెక్ట్‌ అయ్యారు అనడంతో.. నీలో నాకు కొన్ని నచ్చడం లేదు సూర్య అంటూ  ఆరోహి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో  వైరల్‌ అవుతుంది. ఇందులోనే చలాకీ చంటికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చినట్లు చూపించారు. 




Updated Date - 2022-09-28T02:51:38+05:30 IST