TikTok బ్యాన్ చేయడంతో నిరుద్యోగులుగా మారిపోయాం: Riteish Deshmukh

ABN , First Publish Date - 2021-10-20T17:17:12+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అందుబాటులోకి రావడంతో కాస్త ఉపశమనం పొందామని బాలీవుడ్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ అన్నాడు.

TikTok బ్యాన్ చేయడంతో నిరుద్యోగులుగా మారిపోయాం: Riteish Deshmukh

భారత్‌లో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో తాము నిరుద్యోగులుగా మారిపోయామని, అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అందుబాటులోకి రావడంతో కాస్త ఉపశమనం పొందామని బాలీవుడ్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ అన్నాడు. లాక్‌డౌన్ సమయంలోనూ, అంతకు ముందు జెనీలియా, రితేష్ కలిసి టిక్‌టాక్‌లో ఎన్నో ఫన్నీ వీడియోస్‌ను పోస్ట్ చేశారు. ముఖ్యంగా లాక్‌డౌన్ మొదటి దశ సమయంలో రితేష్, జెన్నీలియా కలిసి చేసిన వీడియోస్ ఎంతో మందికి ఆనందం పంచాయి. 


`టిక్ టాక్ మాకు ఎంతో పని కల్పించింది. అయితే దేశంలో టిక్ టాక్ బ్యాన్ కావడంతో మేం పని లేకుండా అయిపోయినట్టు అనిపించింది. టిక్‌టాక్ బ్యాన్ వార్త విని.. దేవుడా ఇప్పుడేం చెయ్యాలి అనుకున్నాం. అయితే రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకురావడంతో కాస్త ఉపశమనం దొరికింద`ని రితేష్ నవ్వుతూ చెప్పాడు. రితేష్, జెనీలియా కలిసి ప్రస్తుతం `లేడీస్ Vs జెంటిల్‌మెన్` అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ వీడియోలో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ అవుతోంది. 

Updated Date - 2021-10-20T17:17:12+05:30 IST