మతాంతర ప్రేమపై నెటిజన్ కామెంట్... మతిపోయేలా చీవాట్లు పెట్టిన హీరోయిన్...

ABN , First Publish Date - 2021-10-12T01:43:03+05:30 IST

రిచా చద్దా బాయ్‌ఫ్రెండ్ పేరు అలీ ఫజల్. వారిద్దరు ప్రేమలో మునిగితేలుతు ప్రస్తుతం సహ జీవనం కూడా చేస్తున్నారు. త్వరలో పెళ్లి కూడా! కానీ, రిచా, అలీ ఇద్దరి మతాలు వేరువేరు కావటంతో ఓ నెటిజన్ కొంచెం దురుసుగా కామెంట్ చేశాడు.

మతాంతర ప్రేమపై నెటిజన్ కామెంట్... మతిపోయేలా చీవాట్లు పెట్టిన హీరోయిన్...

‘‘సర్వేశ్, నా గురించి మరిచిపో, ముందసలు నీకు మెదడంటూ ఒకటుందా? లేక నిన్ను ఎవ్వరూ కోరి పెళ్లాడకపోవటంతో మెదడు కాస్తా పోయిందా? అయినా అసలు నీ విషయంలో, అమ్మాయే కట్నం తీసుకుని ఉంటుంది... నిన్ను పెళ్లాడటానికి. నీకు అందమూ లేదు, తెలివి కూడా లేదు. నువ్వు పేదోడివి కూడానా? మీ అమ్మ బహుశా, గ్యాస్ సిలిండర్ వదిలేసి మట్టి పోయ్యికి మారిపోయి ఉంటుంది. ఆంటీకి నా నమస్కారాలు! ఇలాంటి ముఖం ఉన్న దెయ్యాన్ని ఆమె ఎలా ఈ ప్రపంచంలోకి తెచ్చిందో? ఈ నిరుద్యోగి, దయనీయమైన వ్యక్తి ఇక్కడ మాట్లాడటానికి తప్ప దేనికీ పనికిరాడు...’’ ఇంత కోపం ఎవరికి అంటారా? బాలీవుడ్ నటి రిచా చద్దాకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకు కారణం, ఓ ఆకతాయి నెటిజన్ చేసిన తీవ్రమైన కామెంటే! 


రిచా చద్దా బాయ్‌ఫ్రెండ్ పేరు అలీ ఫజల్. వారిద్దరు ప్రేమలో మునిగితేలుతు ప్రస్తుతం సహ జీవనం కూడా చేస్తున్నారు. త్వరలో పెళ్లి కూడా! కానీ, రిచా, అలీ ఇద్దరి మతాలు వేరువేరు కావటంతో ఓ నెటిజన్ కొంచెం దురుసుగా కామెంట్ చేశాడు. వారి వివాహం కూడా ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ పెళ్లి మాదిరిగా పెటాకులవుతుందని జోస్యం చెప్పాడు. దాంతో కోపం కట్టలు తెంచుకున్న రిచా చద్దా నానా తిట్లు తిట్టింది. నిన్ను పెళ్లి చేసుకోటానికి పెళ్లి కూతురే కట్నం తీసుకుని ఉంటుంది లాంటి సెటైర్లు వేసింది. ఆ నెటిజన్ తల్లిని ఉద్దేశించి ‘‘ఇలాంటి వాడ్ని ఎలా కన్నావ్?’’ అంటూ ఓ ఇంగ్లీష్ బూతు కూడా వాడేసింది!   

Updated Date - 2021-10-12T01:43:03+05:30 IST