RGV: ఏమండోయ్ నానిగారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వండి..!

ABN , First Publish Date - 2022-01-04T16:59:36+05:30 IST

సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై మంత్రి పేర్ని నానికి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్‌ చేశారు. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత? హీరోల రెమ్యూనరేషన్‌ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు,

RGV: ఏమండోయ్ నానిగారు.. ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వండి..!

సినిమా టికెట్ల ధరల విషయంపై తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్ల వర్షం కురిపించారు. ఇవాళ ఉదయం ట్విట్టర్ వేదికగా పేర్ని నానికి పలు సూటి ప్రశ్నలు సంధించారు. ‘ సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత? హీరోల రెమ్యూనరేషన్‌ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపైనే ఉంటుంది. ఖర్చు, రాబడి విషయాన్ని మంత్రుల బృందం అర్థం చేసుకోవాలి. పేదలకు సినిమా అవసరమనిపిస్తే రాయితీ ఇవ్వొచ్చు కదా?. వైద్య, విద్యా సేవలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. అదే రీతిలో సినిమాలకు ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు? అని ఆర్జీవీ ప్రశ్నించారు.


సినిమా నిర్మాణానికి ఎందుకు వర్తించదు..!

నిత్యావసర వస్తువుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వ జోక్యంతో ధరలు నిర్ణయిస్తారు. అదే రీతిన సిమాలకు ఎలా వర్తింపజేస్తారు? ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే రైతుల నష్టపోతారు. ప్రోత్సాహం కోల్పోతే నాణ్యత లోపాన్ని సృష్టిస్తుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది కదా..! అని వర్మ ట్వీట్‌లో ప్రశ్నించారు.




ఆ తర్వాత మీ ఖర్మ..!

మీ గౌరవప్రదమైన బృందం హీరోల ధరలను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అల్లుఅర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరులు రెమ్యునరేషన్ అనేది వారి సినిమా ప్రొడక్షన్‌కి అయ్యే ఖర్చు, రాబడిని బట్టే నిర్ణయింపబడుతుంది. మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుంచి మద్దతు ఇవ్వడానికి అధికారం ఇచ్చారు.. అంతేకానీ మా నెత్తిపైన కూర్చోవడానికి కాదని అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను .. చేతులు జోడించి ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో ఇతర కొలీగ్స్ ఈ సమస్యపై అందరూ మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ నోళ్లు తెరవలేరు.. ఆ తర్వాత మీ ఖర్మఅని ఆర్జీవీ పెను సంచలనం రేపే ట్వీట్ల వర్షం కురిపించారు.


                    ఆర్జీవీ ట్వీట్లపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన్ను విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే ‘ఆర్జీవీ అస్సలు తగ్గేదేలే’ అంటూ సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. మరి వర్మ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా పేర్ని నాని నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి.

Updated Date - 2022-01-04T16:59:36+05:30 IST