ఏపీ ప్రభుత్వంపై ఆర్‌జీవీ ట్వీట్ల వర్షం!

ABN , First Publish Date - 2022-01-12T00:19:55+05:30 IST

ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. గంటలో 25కు పైగా ట్వీట్లు చేశారు. మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. వర్మ ట్వీట్ల సారాంశం..

ఏపీ ప్రభుత్వంపై ఆర్‌జీవీ ట్వీట్ల వర్షం!

ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు.  మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. గంటలో 25కు పైగా ట్వీట్లు చేశారు. మంత్రి పేర్ని నానితో సమావేశం సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. వర్మ ట్వీట్ల సారాంశం..


1. సినిమా టికెట్లకు విధించినట్లే ఇంకేదైనా ప్రొడక్ట్‌పై ప్రభుత్వం నిబంధనలు విధించిందా? ఒకవేళ విధించినట్లు అయితే ఆ ఉత్పత్తి పేరు, అందుకు కారణాలు తెలపాలి. 


2. రూ.500 కోట్లతో తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను రూ.కోటి తీసిన చిత్రంతో ఎలా పోల్చుతాం. చిన్న చిత్రాలతో సమానంగా బారీ బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరను ఎలా నిర్ణయిస్తారు. 


3. కాంపిటీషన్‌ ఆధారంగానే వస్తువుల నాణ్యత, ధర నిర్ణయిస్త్తారు. బయట శక్తుల ఆధారంగా కంపెనీలు ధరలను నిర్ణయించవు.


4. సినిమా నిర్మాణ వ్యయంతో తమకు సంబంధం లేదని సర్కారు వాదించాలనుకుంటే అదే వాదన ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువుకేౖనా వర్తిస్తుందా? 


5. ఒక వస్తువును తక్కువ ధరకు అమ్మాలని ప్రభుత్వం బలవంతం చేేస్త, అసలు ఉత్పత్తే ఆగిపోవచ్చు. అప్పుడు క్వాలిటీ లేని ప్రొడక్ట్‌లు బయటకు వస్తాయి. 


6. మహరాష్ట్రాలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టికెట్‌ను రూ.2,200కు విక్రయించేందుకు అనుమతిస్తే, తన సొంత రాష్ట్రంలో రూ.200లకు కూడా విక్రయించే అవకాశం లేదు. ఆర్టికల్‌ 14 ప్రకారం అది నిబంధనలను ఉల్లంఘించడం కాదా? 


7. సినిమా టికెట్‌ ధరలు, సమయం, ప్రదర్శన విషయంలో ప్రభుత్వం జోక్యం అవసరం లేదు. ఇతర వస్తువుల ధరల విషయంలో లేని జోక్యం టికెట్లపై ఎందుకు?


8. రాత్రింబవళ్లు థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే వచ్చే నష్టమేంటి? కొవిడ్‌ కన్నా ముందు మహారాష్ట్రలో 24/7 సినిమాలు ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఉన్నాయి. 


8. వినియోగదారులపని వేళలు, సమయానుకూలతను బట్టి సినిమా ప్రదర్శన చేయవచ్చు కదా?  వాళ్లకు ఉన్న వెసులుబాటును బట్టి అర్థరాత్రి సైతం సినిమా చూేసలా అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?


9. ప్రత్యేక షోలకు టికెట్‌ ధరలు అధికంగా ఉన్నా ప్రజలు కొనుగోలు చేేస శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాదా? పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది కదా? 


10. ఒక హీరోకి నిర్మాత ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తున్నారనే విషయంలో సర్కారుకు ఉన్న సమస్య ఏంటి?పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర స్టార్‌ హీరోలకు ఎందుకంత పారితోషికం ఇస్తున్నారంటే, ఒక వేళ మనం ఐఫోన్‌ బద్దలు కొడితే అందులో వాడిన మెటీరియల్‌కు అయిన మొత్తాన్ని లెక్కకడితే రూ.1000 కూడా కాదు. కానీ, రూ.2లక్షలు పెట్టి మనం ఆ ఫోన్‌ కొనుగోలు చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్‌ తయారు చేసిన ఆలోచనకు అంత చెల్లిస్తున్నాం. బ్రాండ్‌, మార్కెట్‌ అలా డిమాండ్‌ చేస్తుంది. అలాగే సినిమా కూడా అంతే! 


11. చైనా జనాభా మనకంటే ఎక్కువ. అమెరికా జనాభా మనకన్నా తక్కువ. కానీ ఆ రెండు ప్రాంతాల్లోనూ మన కన్నా పదిరెట్లు ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ప్రదర్శన విషయంలో మనం ఆ సంఖ్యను చేరుకునేలా ప్రభుతాలు కృషి చేయాలి. 


12. ఖాళీగా ఉన్న స్థలాలు, గౌడౌన్లు, గ్యారేజీలను మినీ థియేటర్లుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే బావుంటుంది. 


13. 70 ఏళ్లుగా అమలు చేస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం 1955ను ఏపీ ప్రభుత్వం తీసి పారేసింది. దీనిపై కోర్టులో సవాల్‌ విసరాలి. 


14. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ అమలు చేయడం సబబే. కానీ, సినిమాటోగ్రఫీ యాక్ట్‌ను అమలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది?


15. ఒకవేళ ప్రజలపై సర్కారుకు ప్రేమ, మమకారం ఉంటే, ఎవరైతే సినిమా టికెట్‌ను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయలేరో వారికి సంక్షేమ పథకం కింద ప్రభుత్వమే రాయితీ కల్పించి విక్రయించవచ్చు కదా!


16. టికెట్‌ రేట్లు, థియేటర్‌లో షోలు గురించి వదిలేసి భద్రత, పన్నులపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. 


17. చివరిగా నేను కోరేది ఒకటే... ప్రభుత్వం, మంత్రి పేర్ని నాని, ఆయన టీమ్‌తో నా సహచరులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోకుండా ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 


Updated Date - 2022-01-12T00:19:55+05:30 IST