రివైంజ్‌ డ్రామా రుద్ర సింహా

ABN , First Publish Date - 2022-07-04T07:14:19+05:30 IST

సంతోష్‌, స్నేహా, మైత్రి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘రుద్ర సింహా’. మనోహర్‌ కాటేపోగు దర్శకుడు. ఆయనతో పాటు ధరగయ్య బింగి...

రివైంజ్‌ డ్రామా రుద్ర సింహా

సంతోష్‌, స్నేహా, మైత్రి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘రుద్ర సింహా’. మనోహర్‌ కాటేపోగు దర్శకుడు. ఆయనతో పాటు ధరగయ్య బింగి, ఆంజనేయులు, కోటేశ్వరరావు జింకల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ నటులు సుమన్‌, భాను చందర్‌ ‘రుద్రసింహ’ ఆడియోని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో రివైంజ్‌ డ్రామా. ఏడు పాటలు, ఐదు పోరాట దృశ్యాలు ఉంటాయి. అవన్నీ మాస్‌ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సినిమాని అనుకొన్నది అనుకొన్నట్టుగా తీర్చిదిద్దా’’ అన్నారు. ఈనెల 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు.


Updated Date - 2022-07-04T07:14:19+05:30 IST