Talasani Srinivas Yadav ని కలిసిన ఛాంబర్ ప్రతినిధులు..

ABN , First Publish Date - 2022-06-23T17:12:34+05:30 IST

సినీ కార్మికులు తమ వేతనాలు పెంచమని ఎప్పటినుంచో నిర్మాతలను కోరుతున్నారు. అయితే, వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో జూన్ 22 నుంచి షూటింగులు నిలిపివేసి ఆందోళనకు దిగారు.

Talasani Srinivas Yadav ని కలిసిన ఛాంబర్ ప్రతినిధులు..

సినీ కార్మికులు తమ వేతనాలు పెంచమని ఎప్పటినుంచో నిర్మాతలను కోరుతున్నారు. అయితే, వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో జూన్ 22 నుంచి షూటింగులు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు మధ్య వివాదం ముదురుతోంది. సినీ కార్మికులంతా కలిసి.. ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడించి తమ డిమాండులకు పరిష్కారం చూపాలనికోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. 


ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఛాంబర్ అధ్యక్షుడు, కౌన్సిల్ అధ్యక్షుడు కలిశారు. సినీ కార్మీకుల సమ్మెపై కీలక అంశాలను చర్చించారు. ఈ రోజున 12 గం.లకు ఫెడరేషన్ ప్రతినిధులుతో చర్చించమని చెప్పటం జరిగింది. ఇక త్వరలోనే కార్మీకుల సమస్యకు పరిష్కరమార్గం దొరుకుతుందని సమాచారం. కాగా, సినీ కార్మీకుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా షూటింగులు జరుపుకుంటున్న 28 సినిమాలు మధ్యలోనే నిలిచిపోయాయి. 

Updated Date - 2022-06-23T17:12:34+05:30 IST