Tiger Nageswara Rao: 18ఏళ్ల తర్వాత రేణు దేశాయ్.. లుక్ ఎలా ఉందో చూశారా!

ABN , First Publish Date - 2022-09-30T00:04:11+05:30 IST

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియాగా పలు భాషల్లో రూపొందిస్తున్నారు.

Tiger Nageswara Rao: 18ఏళ్ల తర్వాత రేణు దేశాయ్.. లుక్ ఎలా ఉందో చూశారా!

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao). వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియాగా పలు భాషల్లో రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్టూవర్ట్‌పురం నేపథ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రేణు దేశాయ్ (Renu Desai) నటించనున్నారు. తాజాగా ఆమె షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

  

‘టైగర్ నాగేశ్వరరావు’ లో హేమలత లవణం పాత్రను రేణు దేశాయ్ పోషించనున్నారు. పవర్ ఫుల్ రోల్‌లో ఆమె కనిపించనున్నారు. రేణు షూటింగ్‌ను ప్రారంభించడంతో ఆమె ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో రేణుదేశాయ్ తెల్లచీర ధరించారు. మహిళా కార్యకర్తలతో కలసి రోడ్డుపై నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రచయిత గుర్రం జాషువా కుమార్తెనే హేమలత లవణం. ఆమె అనేక పుస్తకాలను రచించారు. సామాజిక కార్యకర్తగా సేవలు అందించారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ లో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆర్. మదీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.   




Updated Date - 2022-09-30T00:04:11+05:30 IST