Flashback: పోటాపోటీగా రెజీనా, అనసూయ

ABN , First Publish Date - 2022-07-21T02:40:06+05:30 IST

రెజీనా (Regina), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’ (Flashback). గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా (Prabhu Deva) ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న

Flashback: పోటాపోటీగా రెజీనా, అనసూయ

రెజీనా (Regina), అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’ (Flashback). గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా (Prabhu Deva) ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని పి. రమేష్ పిళ్లై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గతంలో రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ (Don Sandy) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఎన్ బాలాజీ (AN Balaji) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లాష్ బ్యాక్ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను మేకర్స్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ పూర్తి చేసుకుని, సీజీ పనులు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. 


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కింది. రెజీనా, అనసూయలు పోటాపోటీగా నటించారు. ఈ చిత్రంలో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథను చెప్పే విధానం బాగుంటుంది. యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది.  రెజీనా ఇందులో ఆంగ్లో-ఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సీజీ పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాము. అతి త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం.  తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నాము’’ అని తెలిపారు.

Updated Date - 2022-07-21T02:40:06+05:30 IST