Prabhas : ఫ్యాన్స్‌కు ‘రెబల్’ టెన్షన్ !

ABN , First Publish Date - 2022-08-16T22:24:24+05:30 IST

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ (Prabhas).. ‘రాధేశ్యామ్’ (Radheshyam) చిత్రంతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచారు. అయినప్పటికీ.. తదుపరి చిత్రాలు ‘సలార్ (Salaar), ఆదిపురుష్ (Aadipurush), ప్రాజెక్ట్ కె’ (Project K) లపై దాని ప్రభావం ఏమాత్రం పడలేదు.

Prabhas : ఫ్యాన్స్‌కు ‘రెబల్’ టెన్షన్ !

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ (Prabhas).. ‘రాధేశ్యామ్’ (Radheshyam) చిత్రంతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచారు. అయినప్పటికీ.. తదుపరి చిత్రాలు ‘సలార్ (Salaar), ఆదిపురుష్ (Aadipurush), ప్రాజెక్ట్ కె’ (Project K) లపై దాని ప్రభావం ఏమాత్రం పడలేదు. ఈ మూడింటిపై బ్రహ్మాండమైన క్రేజ్ నెలకొంది. వచ్చే ఏడాది జనవరి 12 ఆదిపురుష్ విడుదల కానుండగా.. సెప్టెంబర్ 28న ‘సలార్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ సూపర్ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో ‘సలార్’ పై మరింతగా హైప్ క్రియేట్ అయింది. ఒకేసారి ప్రభాస్ నటిస్తోన్న రెండు చిత్రాలకు విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాకపోతే ‘సలార్’ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు.


సెప్టెంబర్ 28 అంటే ప్రభాస్ అభిమానులకు పీడకలలాంటి రోజు. ఎందుకంటే ఆ డేట్లోనే ‘రెబల్’ (Rebel) చిత్రం విడుదలైంది. 2012లో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) దర్శకత్వంలో, కృష్ణంరాజు (Krishnamraju) ప్రధాన పాత్రలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు లారెన్స్‌కు, నిర్మాతలకు గొడవలు కూడా జరిగాయి. ఫ్లాప్ సినిమా తీసినందుకు నిర్మాతలకు ఫైన్ రూపంలో కొంత డబ్బు చెల్లించారు లారెన్స్. ఆ దెబ్బ లారెన్స్ కెరీర్ పై గట్టిగా పడింది. అప్పటి నుంచి లారెన్స్ టాలీవుడ్ టాప్ హీరోల చుట్టూ తిరగడం మానేసి.. కోలీవుడ్‌లో సినిమాలు చేసుకుంటున్నారు. 


అలా ‘రెబల్’ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు పీడకలగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే రోజున సలార్ విడుదలవుతూండడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాబట్టి.. ఆ నెగెటివ్ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్తించదని అనుకుంటున్నారు. నిజానికి ఫ్లాప్ సినిమా విడుదలైన రోజున మరో సినిమాను వదలడానికి ఏ హీరో ఇష్టపడడు. కానీ ప్రభాస్ మాత్రం డేర్ చేస్తున్నాడు. మరి ‘సలార్’ చిత్రం ఆ సెంటిమెంట్‌ను అధిగమించి ఏ స్థాయి సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.  

Updated Date - 2022-08-16T22:24:24+05:30 IST