Vikram: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2022-06-02T03:53:01+05:30 IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). స్టార్ నటులు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో..

Vikram: తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గుడ్ న్యూస్!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). స్టార్ నటులు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో హీరో సూర్య (Suriya) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. జూన్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో హీరో నితిన్‌ (Nithiin)కు చెందిన శ్రేష్ఠ్ మూవీస్ (Sreshth Movies) సంస్థ భారీగా విడుదల చేయబోతుంది. అయితే ఈ చిత్రానికి సాధారణ ధరలే ఉంటాయని.. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి, ఎంజాయ్ చేసేందుకు.. టికెట్ ధరలను పెంచడం లేదని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. 


వారు ప్రకటించిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ చిత్రానికి సంబంధించి టికెట్ ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 147, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 177 ఉండనుందని ప్రకటించారు. అలాగే తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 150, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 200 ఉండనుందని తెలుపుతూ.. తాజాగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తారని చిత్ర నిర్మాతలు, అలాగే చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న శ్రేష్ఠ్ మూవీస్ అధినేతలు భావిస్తున్నారు. కాగా, కమల్ హాసన్ ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా.. తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌ (R Mahendran)తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోలీవుడ్ మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ చిత్రానికి సంగీతం అందించారు.



Updated Date - 2022-06-02T03:53:01+05:30 IST