నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఽథ్యాంక్యూ’. రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. జులై 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నాగచైతన్య పోస్టర్ స్టైలీ్‌షగా, కూల్‌గా ఉండి ఆకట్టుకొంటోంది. ‘‘నాగచైతన్య కెరీర్లో ఇదో మరపురాని చిత్రంగా మిగిలిపోతుంది. చైతూ పాత్ర కూడా కొత్త తరహాలో ఉంటుంది. పిసి శ్రీరామ్ కెమెరా పనితనం, తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణలు’’ అని చిత్రబృందం తెలిపింది.