మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడానికి సిద్ధమే

ABN , First Publish Date - 2022-10-02T07:10:13+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. ఈనెల 5న వస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్‌ ఓ కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే...

మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడానికి  సిద్ధమే

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. ఈనెల 5న వస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్‌ ఓ కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ముంబైలో ‘గాడ్‌ ఫాదర్‌’ హిందీ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘మా ‘గాడ్‌ఫాదర్‌’కి మాతృక.. లూసీఫర్‌. అందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చేసిన పాత్ర చాలా కీలకం. అందులో సల్మాన్‌ నటిస్తే బాగుంటుందనిపించింది. వెంటనే సల్మాన్‌ని అడిగాను. ‘నేను చేస్తే బాగుంటుందని మీరనుకొంటే తప్పకుండా నటిస్తా’ అని వెంటనే ఓకే చేసేశాడు. సల్మాన్‌ రాకతో... ‘గాడ్‌ ఫాదర్‌’ క్రేజ్‌ మరింత పెరిగింద’’న్నారు. సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేయడానికి కారణం.. చిరంజీవిగారే. ఆయనకు సినిమాపై చాలా ప్రేమ ఉంది. అందుకోసమే ఈ సినిమా చేశా. ఇది నా తొలి తెలుగు సినిమా. నాకు మల్టీస్టారర్‌ చిత్రాలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్లు చేయాలని ఉంది. దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉంద’’న్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మోహన్‌ రాజా, నటులు సత్యదేవ్‌, గెటప్‌ శీను, నిర్మాతలు ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-02T07:10:13+05:30 IST