‘సారీ... మన్నించ’మంటే కూడా సీరియస్ అవుతోన్న Priyanka Chopra

ABN , First Publish Date - 2022-02-27T03:04:50+05:30 IST

రోజీ ఓ డోనల్ అనే అమెరికన్ కమెడియన్ వెటకారంపై... ప్రియాంక సీరియస్ అయింది. అయితే, ఆమె ‘సారీ’ చెప్పినప్పటికీ మన దేసీ గాళ్ ఆగ్రహం చల్లారలేదు. ఎందుకంటే, సదరు లేడీ కమెడియన్ ప్రైవేట్ మీటింగ్‌లో జరిగిన తప్పిదాన్ని పబ్లిక్‌లో చెప్పింది. అక్కడితో ఆగకుండా ‘క్షమాపణలు’ కోరింది. కానీ, సారీ చెబుతూనే...

‘సారీ... మన్నించ’మంటే కూడా సీరియస్ అవుతోన్న Priyanka Chopra

రోజీ ఓ డోనల్ అనే అమెరికన్ కమెడియన్ వెటకారంపై... ప్రియాంక సీరియస్ అయింది. అయితే, ఆమె ‘సారీ’ చెప్పినప్పటికీ మన దేసీ గాళ్ ఆగ్రహం చల్లారలేదు. ఎందుకంటే, సదరు లేడీ కమెడియన్ ప్రైవేట్ మీటింగ్‌లో జరిగిన తప్పిదాన్ని పబ్లిక్‌లో చెప్పింది. అక్కడితో ఆగకుండా ‘క్షమాపణలు’ కోరింది. కానీ, సారీ చెబుతూనే ‘ద చోప్రా వైఫ్’ అంటూ పద ప్రయోగం చేసింది. అది కాస్తా మిసెస్ నిక్ జోనాస్‌కి నచ్చలేదు. అందుకే, ఆమె తన భావాల్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది... 


‘‘మీకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలనిపిస్తే... ముందు నా పేరు గూగుల్ చేయండి...’’ అంది ప్రియాంక చోప్రా. రోజీ తనని ‘ద చోప్రా వైఫ్’ అనటంతో పీసీ ఈ విధంగా రియాక్ట్ అయింది. అంతే కాదు, ‘‘నిజాయితీగా క్షమాపణ చెప్పాలనుకున్నప్పుడు... ‘సమ్‌వన్’ అనీ, ‘వైఫ్’ అనీ సంబోధించటం సరికాదు... ఎవరినైనా మనం గౌరవించాలనుకుంటే, వార్ని ముందు, వ్యక్తిగా గుర్తించాలి...’’ అని వ్యాఖ్యానించింది. అయితే, అసలు రోజీకి, ప్రియాంక చోప్రాకి మధ్య సమస్య ఎక్కడ మొదలైందంటే...


యూఎస్‌లో మంచి పాప్యులారిటీ ఉన్న కమెడియన్ రోజీ ఓ డోనల్. ఆమె ఈ మధ్యే ఓ టిక్ టాక్ వీడియో చేసింది. అందులో తనకు నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా ఎదురుపడ్డప్పటి ప్రైవేట్ మీటింగ్ గురించి వివరించింది. ప్రియాంక సర్‌నేమ్ ‘చోప్రా’ అని ఉండటంతో రోజీ ఆమెని దీపక్ చోప్రా కూతురు అనుకుందట! దీపక్ చోప్రా అమెరికాలో మంచి పేరున్న రచయిత. అయితే, తాను తప్పుగా భావించిన విషయాన్ని ప్రియాంకతో రోజీ నేరుగానే చెప్పిందట కూడా! కానీ, ‘చోప్రా’ అన్న ఇంటి పేరున్న వారంతా దీపక్ చోప్రా బంధువులు కారంటూ పీసీ వివరణ ఇచ్చింది. అయితే, తమ మధ్య ప్రైవేట్‌గా జరిగిన సంభాషణని రోజీ టిక్ టాక్ వీడియోలో చెప్పటంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. తాను ‘చోప్రా’ అన్న పదం చూసి పొరపాటు పడ్డానని చెప్పిన ఆమె ‘నిక్ జోనాస్ సారీ’ అంది. దాంతో పాటే... ‘ద చోప్రా వైఫ్ సారీ’ అని కూడా చెప్పింది!


రోజీ ఓ డోనల్ తనని ‘ప్రియాంక’ అనకుండా ‘చోప్రా వైఫ్’ అనటంతో అలిగిన మన గ్లోబల్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్ తీసుకుంది. సారీ చెప్పకపోయినా ఫర్వాలేదు... ముందు పేరునైతే సరిగ్గా గూగుల్ చేసి తెలుసుకోమంటూ... సూచించింది. నిక్ జోనాస్‌తో పాటూ చాలా మంది నెటిజన్స్ ప్రియాంక చోప్రా అభిప్రాయానికి తమ మద్దతు తెలిపారు. రోజీ లాంటి వాళ్లు ఏదైనా మాట్లాడే ముందు కాస్త హోమ్ వర్క్ చేయాలని హితవు పలికారు...     

Updated Date - 2022-02-27T03:04:50+05:30 IST