Mahesh Babu మాటలు తనకు అర్థం కాలేదంటోన్న Ram Gopal Varma!

ABN , First Publish Date - 2022-05-13T03:06:11+05:30 IST

మహేశ్ మాట్లాడిన మాటలు వర్మకి అర్థం కాలేదట! ఇంతకీ, ఏంటి విషయం అంటారా?

Mahesh Babu మాటలు తనకు అర్థం కాలేదంటోన్న Ram Gopal Varma!

మహేశ్ మాట్లాడిన మాటలు వర్మకి అర్థం కాలేదట! ఇంతకీ, ఏంటి విషయం అంటారా? 


మహేశ్ బాబు రీసెంట్ గా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ‘మేజర్’ సినిమా గురించి ప్రధానంగా మాట్లాడుతూ ఓ ప్రశ్నకి సమాధానంగా తన బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ప్రస్తావించాడు. ఇంతవరకూ నేరుగా హిందీ సినిమా చేయకపోవటానికి కారణం తెలుగులో తప్ప తాను ఇంకెక్కడా చిత్రాలు చేయవద్దని భావించటమేనని చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లోనే తాను ఎప్పుడూ నటుడిగా కొనసాగాలని భావించానన్న మహేశ్... బాలీవుడ్ కు వెళ్లే ఉద్దేశ్యం లేదని దాదాపు తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తెలుగు సినిమానే పలు భాషల్లో ప్యాన్ ఇండియా మూవీ రూపంలో విజయవంతం అవుతోందని కూడా అభిప్రాయపడ్డాడు. అయితే మహేశ్ బాలీవుడ్ గురించి చర్చిస్తున్న క్రమంలోనే... ‘వాళ్లు నన్ను అఫర్డ్ చేయలేరు’ అనటం ఒకింత కలకలమే రేపింది...


హిందీ ఫిల్మ్ మేకర్స్ కి, అలాగే బాలీవుడ్ సినిమా రంగానికి.. తనని భరించే స్థోమత లేదని సూపర్ స్టార్ మహేశ్ బాబు అనటం రామ్ గోపాల్ వర్మకి అర్థం కాలేదట! ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు తెలియదంటోన్న వర్మ ‘బాలీవుడ్’ ఓ కంపెనీ కాదన్నాడు. అదొక లెబుల్ మాత్రమేనంటూ... హిందీ సినిమా రంగాన్ని మీడియా ‘బాలీవుడ్’ అని పిలుస్తుందంటూ వివరించాడు. సాధారణంగా ఏదో ఒక నిర్మాణ సంస్థ హీరో వద్దకి వచ్చి ఫలానా రెమ్యూనరేషన్ తో తమకు సినిమా చేయమని కోరుతుందని తెలిపిన రాము... మహేశ్ బాబు బాలీవుడ్ మొత్తాన్ని ‘జనరలైజ్’ చేయటం... ‘‘అర్థం కాలేదు’’ అని వ్యాఖ్యానించాడు. 


మహేశ్ మాటలపై ఆయన టీమ్ నుంచీ వివరణ కూడా వచ్చింది. ఏ భాషని, ఏ ఇతర సినిమా రంగాన్నీ తక్కువ చేయటం మహీ ఉద్దేశం కాదని ఓ నోట్ లో తెలిపారు. తెలుగులో సినిమాలు చేయటం తనకు సంతోషంగా ఉందని మాత్రమే ఆయన అన్నట్టు వివరణ ఇచ్చారు.  

Updated Date - 2022-05-13T03:06:11+05:30 IST