#RC15: కొత్త షెడ్యూల్‌లో కియారా..

ABN , First Publish Date - 2022-07-13T18:50:00+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం ఆర్సీ 15 (RC 15).

#RC15: కొత్త షెడ్యూల్‌లో కియారా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం ఆర్సీ 15 (RC 15). ఈ సినిమా షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా.. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరామ్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. అంతేకాదు, ఇండస్ట్రీ బెస్ట్ టెక్నీషయన్లు పని చేస్తుండగా, విదేశీ స్టంట్ నిపుణులు యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే 60శాతం పైగా షూటింగ్ పూర్తయింది. 


షెడ్యూల్‌కి చిన్న బ్రేక్ ఇచ్చిన యూనిట్ తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తున్నారు. అయితే, ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా జాయిన్ అవుతుంది. తాజాగా అమ్మడు హైదరాబాద్ లో అడుగుపెట్టింది. దీనికి సంబందించిన పిక్స్ కొన్ని నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ టాప్ ధరించిన కియారా నాభి అందాలతో కవ్వించింది. ఇక ఆర్సీ 15 చిత్రీకరణలో రేపటి నుంచి జాయిన్ కానుంది.




ఇదే షెడ్యూల్ లో సునీల్- శ్రీకాంత్ సహా మరికొంత మంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటుంది. మ్యూజిక్ సెన్షేష న్ ఎస్.ఎస్. థమన్ (SS thaman) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, తమిళం, మలయాళ భాషలలో భారీ స్థాయిలో విడుదల కానుంది. వాస్తంగా 2023, సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. కానీ, అనుకున్న విధంగా చిత్రీకరణ సాగకపోవడంతో 2023, సమ్మర్ కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

Updated Date - 2022-07-13T18:50:00+05:30 IST