# RC 15: కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2022-05-01T17:11:26+05:30 IST

'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాల వరుస సక్సెస్‌లతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి జోష్ మీదున్నాడు. ఈ ఊపుతోనే శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్టు తాజా సమాచారం.

# RC 15: కొత్త షెడ్యూల్ ఎక్కడంటే..!

'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాల వరుస సక్సెస్‌లతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి జోష్ మీదున్నాడు. ఈ ఊపుతోనే శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్టు తాజా సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక 50వ చిత్రం కావడం విశేషం. అంతేకాదు, చరణ్ కెరీర్‌లో 15వ సినిమా కూడా. 


ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ, ఇతర పాత్రల్లో అంజలి, నవీన్ చంద్ర, సునీల్, జయరాం కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొంత టాకీపార్ట్, ఓ సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను వైజాగ్‌లో మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. మే 5 నుంచి ఈ షెడ్యూల్‌ను ప్రారంభించి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాకి సంగీతం ఎస్ ఎస్ థమన్. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే 2023, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తారు. 

Updated Date - 2022-05-01T17:11:26+05:30 IST