RC 15: విలక్షణ నటుడు కన్‌ఫర్మ్..!

ABN , First Publish Date - 2022-07-22T19:24:46+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్సీ 15 ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజా సమాచారం

RC 15: విలక్షణ నటుడు కన్‌ఫర్మ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్సీ 15 ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో విలక్షణ నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య (SJ Surya) కీలక పాత్రలో నటిస్తున్నారట. వాస్తవంగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ మధ్య మధ్యలో ఆన్ లొకేషన్ పిక్స్ లీక్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు అలా పెరిగిపోతున్నాయి. 


ఇటీవలే నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో శంకర్ మరో ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్లబోతున్నారు. రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా పండగే'..అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో ఆర్సీ 15 గురించి భారీ స్థాలో ఊహించుకుంటున్న చరణ్ అభిమానుల అంచనాలు మరింత పెంచే విధంగా ఇప్పుడు దర్శకుడు కమ్ విలన్ అయిన ఎస్ జే సూర్య కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆర్సీ 15 మూవీ గురించి చెప్పారు.


ఈ సందర్భంగా ఆయన..'ఆర్సీ 15 సినిమాలో ముఖ్యమంత్రి తనయుడిగా కనిపించబోతున్నాను'.. అని స్వయంగా వెల్లడించారు. దాంతో ఆర్సీ 15 లో సూర్య నటిస్తున్న వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇక ఇందులో ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని కూడా తెలుస్తోంది. కాగా, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Adavani) చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) శిరీష్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా గనక పూర్తైతే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Updated Date - 2022-07-22T19:24:46+05:30 IST