# RC 15: వైజాగ్ బీచ్‌లో చరణ్ - కియారా..!

ABN , First Publish Date - 2022-05-07T18:27:52+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ (RRR), ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య (Acharya) సినిమాలతో

# RC 15: వైజాగ్ బీచ్‌లో చరణ్ - కియారా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ (RRR), ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య (Acharya) సినిమాలతో వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ సాధించగా, ఆచార్య మాత్రం ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా ఫలితం గురించి చరణ్ పట్టించుకోకుండా నెక్స్ట్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. క్రియేటివ్ జీనియస్ శంకర్ (Shankar) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆర్సీ 15 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ నిర్మాత దిల్ రాజు సంస్థ శీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు 50వ సినిమా కావడం విశేషం.


అందుకే, బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఏమాత్రం ఆలోచించకుండా పాన్ ఇండియన్ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. తండ్రీకొడులుగా కనిపించనున్న చరణ్.. ఓ పాత్రలో పొల్టీషియన్‌గా, మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. అయితే, ఆర్సీ 15 కొత్త షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ షెడ్యూల్‌లో తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది.


చరణ్‌కు సంబంధించిన కాలేజ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను.. ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను.. అలాగే, చరణ్ - ఫైటర్ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా సమాచారం. ఇదే క్రమంలో చరణ్ - కియారాలపై బీచ్‌లోనూ కొన్ని సీన్స్ చిత్రీకరించారట. ఇక ఆర్సీ 15 ని 2023, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఇంతకముందు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. కాగా, ఈ మూవీలో అంజలి, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2022-05-07T18:27:52+05:30 IST