వాయిదా పడిన రవితేజ Ramarao onduty

ABN , First Publish Date - 2022-05-26T18:41:42+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా.. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ( Ramarao Onduty). దివ్యా్న్షు కౌశిక్ (Divyanshu koushik), మల్లూ బ్యూటీ రజిషా విజయన్ (Rajisha Vijayan) కథానాయికలుగా నటిస్తుండగా.. తనికెళ్ళ భరణి, తొట్టెంపూడి వేణు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వాయిదా పడిన రవితేజ Ramarao onduty

మాస్ మహారాజా రవితేజ హీరోగా.. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ( Ramarao Onduty). దివ్యా్న్షు కౌశిక్ (Divyanshu koushik), మల్లూ బ్యూటీ రజిషా విజయన్ (Rajisha Vijayan) కథానాయికలుగా నటిస్తుండగా.. తనికెళ్ళ భరణి, తొట్టెంపూడి వేణు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ డిప్యూటీ కలెక్టర్ గానూ, యం.ఆర్వో గానూ రవితేజ నటిస్తుండడం విశేషం. ఈ సినిమాను జూన్ 17న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే సినిమా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇంతకు ముందు ‘ఖిలాడి’ (Khiladi) చిత్రంతో నిరాశపరిచిన రవితేజ.. ఈ సినిమాతో ష్యూర్ షాట్ హిట్ అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆత్రుతతో ఉన్నారు. 


అయితే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు (మే 26)  నిర్మాతలు అఫీషియల్‌‌గా  ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ప్రేక్షకుల ముందుకు బెటర్ ఔట్ పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao Onduty) చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ఎక్స్‌ట్రా కేర్ తో చేస్తున్నామని అందుకే తమ చిత్రం జూన్ 17న విడుదల కావడం లేదని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే సరికొత్త  విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమాకి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. మాస్ మహారాజా డిప్యూటీ కలెక్టర్ (Deputy Collector) గా అదరగొట్టాడని.. ఈ సినిమా కచ్చితంగా హిట్టై తీరుతుందని అంటున్నారు. రవితేజ టీమ్ వర్క్స్ , శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సామ్ (sam) సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాతలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 



Updated Date - 2022-05-26T18:41:42+05:30 IST