Raviteja : మళ్ళీ వార్తల్లోకి ఆ సినిమా.. !

Twitter IconWatsapp IconFacebook Icon
Raviteja : మళ్ళీ వార్తల్లోకి ఆ సినిమా.. !

‘ఖిలాడి (Khiladi), రామారావు ఆన్ డ్యూటీ (Ramarao Onduty)’ చిత్రాలతో వరుసగా పరాజయాలు ఫేస్ చేశాడు మాస్ మహారాజా రవితేజ (Raviteja). అయినప్పటికీ ఎక్కడా స్పీడ్ తగ్గించడం లేదు. జయాపజయాల్ని పట్టించుకోకుండా.. తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టే ఓకే చేస్తూ చకచకా పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు (Nakkina Trinatharao) దర్శకత్వంలో ‘ధమాకా’ (Dhamaka), వంశీకృష్ణ (Vamshi Krishna) దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao), సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో ‘రావణాసుర’ (Ravanasura) చిత్రాల షూటింగ్‌లో ఏకకాలంలో పాల్గొంటూ మిగతా హీరోల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.  అయితే ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో.. తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ రాజా. 

‘ప్రేమ ఇష్క్ కాదల్’ (Prema Ishq Kathal) చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni).. నిఖిల్ (Nikhil) నటించిన ‘సూర్య VS సూర్య’ (Surya Vs Surya) సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమాకి మంచి పేరే వచ్చినప్పటికీ... రెండో సినిమా తీయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు కార్తిక్. ఎట్టకేలకు రవితేజ హీరోగా తన నెక్స్ట్ మూవీని లాక్ చేసుకున్నాడు . స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పోలాండ్‌లో అక్టోబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి ‘ఈగిల్’ (Eagle) అనే క్యాచీ అండ్ పవర్ ఫుల్ టైటిల్ ప్రచారంలో ఉంది. అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

తాజా సమాచారం ప్రకారం రవితేజ, కార్తిక్ కాంబో మూవీ.. హాలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘జాన్‌విక్’ (Johnwick) ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. కీనూరీవ్స్ (Keanu Reeves) హీరోగా నటించిన ఈ సినిమా మూడు భాగాల ఫ్రాంచైజీ. ఈ మూడూ సూపర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం నాలుగో భాగం ఫిల్మింగ్‌లో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా పేరు మహేశ్ తాజా లుక్ విషయంలో వినిపించింది. నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలోకి వదిలిన ఆ లుక్‌ను చూసి అభిమానులు ‘జాక్‌విక్’ చిత్రంలోని కినూరీవ్స్ గెటప్‌తో పోల్చి తెగ వైరల్ చేశారు. ఇప్పుడు ఇదే సినిమా పేరు మరోసారి రవితేజ తాజా చిత్రం విషయంలో వినిపించడం గమనార్హం. ప్రొఫెషనల్ కిల్లరైన జాన్‌విక్.. క్రైమ్ సిండికేట్ నియమాల్ని ఉల్లంఘిస్తాడు. దాంతో అతడి తలకు విలువ కడుతుంది సిండికేట్. ఈ క్రమంలో తనని చంపడానికి వచ్చిన వారినుంచి అతడు ఎలా తప్పించుకొని బైట పడతాడు అనేదే కథాంశం. జాన్‌విక్ మూడు భాగాల్లోనూ హీరో తన చావునుంచి తప్పించుకొని బైటపడడం ఆసక్తిగా ఉంటుంది.  మరి ఆ పాత్రను రవితేజ ఏ స్థాయిలో రక్తికట్టిస్తాడో చూడాలి.  

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.