Raviteja : లిస్ట్ లోకి మరో సీక్వెల్

ABN , First Publish Date - 2022-08-03T18:02:13+05:30 IST

మాస్ మహారాజా రవితేజ (Raviteja) తన కెరీర్‌లో ఎన్నో పాత్రలకి లైఫ్ ఇచ్చారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటే.. తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోతాడని చాలా సార్లు ప్రూవ్ అయింది. అందుకే ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్ తీసే ఉద్దేశంతో ముందుగానే ఐడియాలు రెడీ చేసుకుంటారు దర్శకులు.

Raviteja : లిస్ట్ లోకి మరో సీక్వెల్

మాస్ మహారాజా రవితేజ (Raviteja) తన కెరీర్‌లో ఎన్నో పాత్రలకి లైఫ్ ఇచ్చారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకుంటే.. తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోతాడని చాలా సార్లు ప్రూవ్ అయింది. అందుకే ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్ తీసే ఉద్దేశంతో ముందుగానే ఐడియాలు రెడీ చేసుకుంటారు దర్శకులు. ఇటీవల విడుదలైన రవితేజ చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’ (Ramarao Onduty). ఈ సినిమా ఎండింగ్‌లో దీనికి సీక్వెల్ ఉండబోతున్నట్టు లీడ్ ఇచ్చాడు దర్శకుడు శరత్ మండవ (Sharath Mandava). అందులో రవితేజ పాత్రని మరింత పవర్‌‌ఫుల్‌గా తీర్చిదిద్దబోతన్నట్టు హింట్ కూడా ఇచ్చాడు. అయితే సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఏమంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. మరి ఈ విషయంలో దర్శక, నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి.


నిజానికి రవితేజ ఇంతకు ముందే సూపర్ హిట్ ‘కిక్’ (Kick) చిత్రానికి సీక్వెల్ చేశారు. ‘కిక్ 2’ (Kick 2) గా విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. మొదటి భాగంలో ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్న ఈ పాత్ర రెండో భాగానికి వచ్చేసరికి నేపథ్యం మారి, తెలుగు నేటివిటీ మిస్ అవడంతో.. జనానికి ఏ మాత్రం కిక్ ఇవ్వలేకపోయింది. అందుకే సీక్వెల్స్ కు కొంతకాలం బ్రేక్ ఇచ్చారు రవితేజ. అయినప్పటికీ ఆయనతో సినిమాలు తీస్తున్న దర్శకులు మాత్రం సీక్వెల్స్ కోసం కథాంశాల్ని రెడీ చేసుకుంటున్నారు. అలాంటి వారి లిస్ట్ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముందు వరుసలో ఉన్నాడు. రవితేజతో తీసిన ‘రాజాది గ్రేట్’ (Raja The Great) చిత్రం సూపర్ హిట్ అవడంతో.. దానికి సీక్వెల్ లైన్‌ను ఎప్పుడో రెడీ చేసిపెట్టుకున్నాడు. ‘రామారావు ఆన్‌డ్యూటీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అనిల్ ఆ విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 


ఇక సీక్వెల్ లిస్ట్ లో ఉన్న మరో చిత్రం ‘క్రాక్’ (Krack). గతేడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టరైన ఈ సినిమాకి సీక్వెల్ స్టోరీని రాసిపెట్టుకున్నాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). రవితేజ డేట్స్ ఇస్తే మళ్ళీ బూమ్ బద్దలయ్యే బ్లాక్ బస్టర్ ఇస్తానంటున్నాడు గోపీచంద్. ‘విక్రమార్కుడు’ తర్వాత మళ్ళీ పోలీస్ గా విజ‌ృంభించిన రవితేజ కెరీర్‌లో మరో మైల్ స్టోన్ గా నిలిచింది ‘క్రాక్’. రవితేజ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన సీక్వెల్స్ లిస్ట్ లో ఇది కూడా చేరిపోయినట్టే. మరి వీటిలో ముందుగా ఏ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుందో చూడాలి. 

Updated Date - 2022-08-03T18:02:13+05:30 IST