Mahalakshmi Marriage: నెట్టింట వైరల్‌గా మారిన సినీ నటి మహాలక్ష్మి పెళ్లి ఫొటోలు.. Fat Man Facts అంటూ పోస్ట్ పెట్టిన నిర్మాత

ABN , First Publish Date - 2022-09-02T21:49:19+05:30 IST

ప్రేమకి డబ్బు, అందం ఇలాంటివేవీ అడ్డుకావని అందరూ అంటుంటారు. తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌..

Mahalakshmi Marriage: నెట్టింట వైరల్‌గా మారిన సినీ నటి మహాలక్ష్మి పెళ్లి ఫొటోలు.. Fat Man Facts అంటూ పోస్ట్ పెట్టిన నిర్మాత

ప్రేమకి డబ్బు, అందం ఇలాంటివేవీ అడ్డుకావని అందరూ అంటుంటారు. తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ (Ravindar Chandrasekaran), ప్రముఖ నటి మహాలక్ష్మి (Mahalakshmi) పెళ్లి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. రవీందర్ చాలా లావుగా ఉంటాడు.. అలాగే మహాలక్ష్మి సన్నగా ఉంటుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుని ఒకటైయ్యారు. ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ జంట తమ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ పిక్స్‌లో ఈ జంట సంప్రదాయ పెళ్లి బట్టల్లో చూడముచ్చటగా ఉంది. 


పెళ్లి ఫోటోలను షేర్ చేసిన మహాలక్ష్మి.. ‘నువ్వు జీవితంలోకి రావడం నా అదృష్టం.. నీ ప్రేమతో నా జీవితాన్ని సంపూర్ణం చేశావు.. లవ్ యూ అమ్మూ’ అని  రాసుకొచ్చింది.


ఈ కొత్త జంట చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సూపర్ క్లిక్. రవి మీరు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ ఓ కొందరు.. ‘మీ ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు’ మరి కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ‘మార్కండేయనుమ్ మగళిర్ కల్లూరియం’, ‘మురుంగైకై చిప్స్’ అనే సినిమాలకి దర్శకుడిగా, నిర్మాతగా రవీందర్‌కి తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది. అలాగే.. వీడియో జాకీగా కెరీర్‌ని మొదలుపెట్టిన మహాలక్ష్మీ తర్వాత నటిగా మారింది. అనంతరం.. ‘యామిరుక్క బయమెన్’, ‘అరసి’, ‘చెల్లమాయ్’, ‘వాణి రాణి’, ‘పిళ్లై నీలా’ వంటి సీరియల్స్.. అలాగే పలు సినిమాల్లోనూ యాక్ట్ చేసి నటిగా మంచి గుర్తింపు సాధించింది.


మరోవైపు చిత్ర నిర్మాత సైతం పెళ్లి పిక్స్‌ని షేర్ చేసి.. ‘మహాలక్ష్మి లాంటి అమ్మాయి మనకు లభిస్తే, జీవితం బాగుంటుందని చెబుతారు.. అయితే ఆ మహాలక్ష్మికి జీవితం ఎలా ఉంది.. త్వరలో Fat Man Facts ప్రత్యక్ష ప్రసారంలో తెలుసుకోండి. నా భార్యతో కుట్టి కథ’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు.





Updated Date - 2022-09-02T21:49:19+05:30 IST