Ravi Teja: ఈ సినిమాలో రవితేజ రోల్ వింటే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2022-09-26T17:15:23+05:30 IST

రవితేజ (Ravi Teja) ప్రస్తుతం చాలా సినిమాలతో చాలా బిజీగా వున్నాడు. బహుశా తెలుగు సినిమాలో ప్రస్తుతం వున్న అగ్ర నటుల్లో రవితేజలా ఇన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి వొప్పుకొని చేస్తున్నవారు ఎవరూ లేరేమో.

Ravi Teja: ఈ సినిమాలో రవితేజ రోల్ వింటే షాక్ అవుతారు

రవితేజ (Ravi Teja) ప్రస్తుతం చాలా సినిమాలతో చాలా బిజీగా వున్నాడు. బహుశా తెలుగు సినిమాలో ప్రస్తుతం వున్న అగ్ర నటుల్లో రవితేజలా ఇన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి వొప్పుకొని చేస్తున్నవారు ఎవరూ లేరేమో. 'ధమాకా' (Dhamaka) సినిమా పూర్తి కావస్తోంది, 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao) ఒక పక్క షూటింగ్ అవుతోంది, అలాగే ఇంకో పక్క 'రావణాసుర' (Ravanasura) కూడా చేసేస్తున్నాడు. అలాగే చిరంజీవి సినిమా 'వాల్తేర్ వీర్రాజు' (Waltair Veerraaju) లో రవితేజ ఒక ప్రాముఖ్యమయిన రోల్ చేస్తున్నాడు. ఇవన్నీ కాకుండా కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం లో కూడా రవితేజ ఒక సినిమా ఒప్పుకున్నాడు, దీన్ని పీపుల్స్ మీడియా (Peoples Media) వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 


ఈ సినిమాలో రవితేజ రోల్ మాత్రం ఇంతకు ముందు అతను ఎప్పుడూ టచ్ చేయని రోల్ చేస్తున్నాడు అని తెలిసింది. రవితేజ ఇందులో డ్యూయల్ రోల్ (Dual role) చేస్తున్నట్టు తెలిసింది. ఒక వృద్ధుడిగా (Old man) రవితేజ ఇందులో కనపడనున్నాడు. ఈ రోల్ మాత్రం ప్రేక్షకులకి ఒక షాకింగ్ (Shocking) లా ఉంటుంది అని అనుకుంటున్నారు. అదే కాకుండా, రవితేజ ఇంకో పాత్ర కూడా వేస్తున్నాడని, దీనికి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) కథానాయికగా నటిస్తుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. ఐతే ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకొని వెంటవెంటనే చేస్తున్న నటులు ఇప్పుడు టాలీవుడ్ (Tollywood) లో లేరు, ఒక్క రవితేజ తప్ప. మరి ఈ సినిమాలు అన్నిటిలో ఎన్ని విజయం సాధిస్తాయో వేచి చూడాలి. 

Updated Date - 2022-09-26T17:15:23+05:30 IST